ఒలింపిక్స్ 2020 జరుగుతున్నది జపాన్ లోనే నైనా ఒలింపిక్ గేమ్స్ కి అతిధ్యం ఇచ్చే పట్టణం పేరుతోనే ఈ క్రీడలకు గుర్తింపు వుంటుంది. ఆతిధ్యం ఇచ్చే పట్టణానికి క్రీడలు జరిగే సంవత్సరం జోడించి నామకరణం చేస్తారు. అంటే ఇపుడు జరిగేది ‘టోక్యో 2020’ ఒలింపిక్ గేమ్స్.
2020లో ఈ టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉన్నా కోవిడ్ పాండెమిక్ వల్ల క్రీడలు జరగలేదు. అందుకే 2021 జూలై-ఆగస్టులో నిర్వహిస్తున్నారు. అయినాసరే, ఈ క్రీడలను టోక్యో 2020 అనే పిలుస్తారు. ఇది ట్రేడ్ మార్క్ టైటిల్.
ఈ ఒలింపిక్ క్రీడల కోసం జపాన్ అంత్యంత ఆధునికంగా ఒక సేడియం నిర్మించింది. టోక్యోలో ఇదే ప్రత్యేకార్షణం. ఇందులో 68,000 సీట్లున్నాయి. 1964లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలకోసం నిర్మించిన స్టేడియాన్ని కూల్చి ఈ స్టేడియం కట్టారు.
జపాన్ లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం ఇది నాలుగో సారి. 1964 సమ్మర్ ఒలింపిక్స్ ( అక్టోబర్ 10-24), 1972 వింటర్ ఒలింపిక్స్ ( ఫిబ్రవి 2-13), 1998 వింటర్ ఒలింపిక్స్ (ఫిబ్రవరి 7-22), 2020 సమ్మర్ ఒలింపిక్స్ ( 2021 జూలై 23-ఆగస్టు 8)
ఈ ఒలింపిక్స్ 33 క్రీడలు, 339 ఈవెంట్స్, 42 వెన్యూస్ ఉంటాయి. జాబితా ఇక్కడ ఉంది.
ఒలింపిక్ ప్రారంభోత్సవం జూలై 23న జరిగుతున్నా బేస్ బాల్, సాఫ్ట్ బాల్, ఫుట్ బాల్ ప్రారంభానికి ముందే జూల 21 నుంచే మొదలవుతాయి.
టోక్యో ఒలింపిక్ మెడల్స్ ని రీసైకిల్డ్ వేస్టు నుంచి తయారు చేశారు. దీనికోసం పాత సెల్ ఫోన్లను, లాప్ టాప్ లను, హ్యాండ్ హెల్డ్ గేమ్స్ ని, కెమెరాలను, ట్రెడిషనల్ అవార్డులను దానం చేయాలని జపాన్ ప్రజలను కోరింది. దీనితో78,000 టన్నలు పాత సామాన్లు వసూలయ్యాయి. వీటి నుంచి 70 పౌండ్ల బంగారు, 7,716 పౌండ్ల వెండి, 4,850 పౌండ్ల బ్రాంజ్ సేకరించారు
క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారుల కోసం బయోడిగ్రేడబుల్ కార్డు బోర్డు మంచాలను రూపొందించారు. మెడల్ పంక్షన్ లకు ఏర్పాటుచేసిన వేదికలు కూడా సస్టైనబుల్ గా వేస్ట్ నుంచే రూపొందిస్తున్నారు.
ఈ సారి క్రీడలను చూసేందుకు అంతర్జాతీయ క్రీడాభిమానులను టోక్యోకు అనుమతించడంలేదు. ఈ సారి గేమ్స్ కు 11,000 మంది క్రీడాకారులు వస్తున్నారు. అధికారులు, కోచ్ లు అదనం.
ఓలింపిక గేమ్స్ కోసం జపాన్ 4.5 మిలియన్ల టికెట్లను గత ఏడాదే విక్రయించింది. వెన్యూస్ 50 శాతం కెపాసిటీ వరకే అనుమతించాలని నిర్ణయించడంతో సందర్శకులను లాటరీ పద్దతిలో నిర్ణయిస్తారు. ప్రవేశం దొరకనివారికి డబ్బు రీఫండ్ చేస్తారు