తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ల భద్రత కోసమనే తాను మౌనంగా ఉన్నానంటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మంత్రుల ధూషణ లను ప్రస్తావిస్తూ తన బలహీనత బయటపెట్టడంతో తెలంగాణ మంత్రులు దాడి తీవ్రం చేశారు.
తన వాదన ఏ విధంగాను సమర్థ నీయం కాదని జగన్ కి ఎవరు చెప్పాలి?
తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు తాను భరోసా అని జగన్ ఎలా అనుకుంటారు.
జగన్ ఉన్నా లేకున్నా తెలంగాణలోని ఆంద్రులు ఇక్కడే జీవిస్తారు. వాళ్ల మీద తెలంగాణలో దాడులు జరుగుతాయనుకోవడం ఏమిటి?
అది రాజకీయ మెచ్యూరిటీ కానేకాదు. జగన్ తానేదో తెలంగాణలో ఉన్న ఆంధ్రులను కాపాడుతున్నానకుని తన బలహీనత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.
కాని, ఆయన బలహీనత ఎంత కప్పుకున్నా పోదు. ఎందుకంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఆయన భుజం భుజం రాసుకోవడంతోనే ఆయన బలహీనత ప్రపంచానికి తెలిసిపోయింది.
జగన్ నే కాదు, జగన్ తండ్రిని అంతంత మాటలంటున్నా జగన్ గాని, జగన్ అమ్మగారు గాని, జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పల్లెత్తు మాట అనలేని పరిస్థితి వచ్చింది.
చీటికి మాటికి చంద్రబాబు మీద దాడిచేయడం బాగుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద, ఆయన కుమారుడు లోకేష్ మీద, ఎంపి విజయసాయి రెడ్డి మొదలుకుని, మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా ఆరడజన్ ట్వీట్ల్, ప్రెస్ కాన్పరెన్స్లు, పత్రికా ప్రకటనలు చేసి చీల్చి చెండాడుతున్నారు.బాగుంది. ఇది రాజకీయాల్లో మామూలే అనుకుందాం.
కాని, ఇదే జగన్ సైన్యం, జగన్ ని గజదొంగ, వైఎస్ ఆర్ ని దొంగ అని అంటే ఏమీ అనలేకపోతున్నారు. ఇదే మిటి? కెసిఆర్ అన్నా, తెలంగాణ అన్నా అంత భయమెందుకు? అందుకే ఈ రోజు తెలంగాణ మంత్రి జగ్ దీష్ రెడ్డి విజృంభించి దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం పై మండిపడ్డారు. తిట్లకు పూనుకున్నారు.
జగదీష్ రెడ్డి ఏమన్నారంటే…
తండ్రిని మించిన దుర్మార్గుడు. సమస్యను సృష్టించిందే ఆంధ్రాసర్కార్
హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందెవరు?
కృష్ణా నదిని దోచుకపోయే పద్ధతుల్లో తండ్రి రాజశేఖర్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడ్డారని ఆయన విరుచుకుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడం, పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం వంటి అహంకార పూరితంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని జగన్ తండ్రిని మించిపోయారని అన్నారు.
అటువంటి నిర్ణయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తో పాటు నిరసన కూడా తెలిపామని ఆయన గుర్తుచేశారు. అంతే గాకుండా కేంద్రం దృష్టికి తీసుకపోవడం తో పాటు కే ఆర్ యం బి కి లేఖ రాశామన్నారు. చివరి ప్రయత్నంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు కూడా ఆక్షేపించందని దానిని ఖాతరు చెయ్యకుండా జగన్ కోర్టు ధిక్కారణకు పాలడ్డారని ఆయన చెప్పారు.
పైగా సర్వేల వరకు నిర్వహించుకుంటామని కోర్టుకు చెప్పిన ఆంధ్రా సర్కార్ పనులు కొనసాగించడం ఎంతవరకు సహేతుకమని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణా ను తెలంగాణా ప్రజలను మోసం చేసినట్లే కోర్టును కూడా మోసం చేసిన చరిత్ర ఉన్న వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానికి లేఖల పేరుతో అక్కడి ప్రజలను వంచనకు గురిచేస్తూంబరన్నారు.
గతంలో మోసం చేసిన చందంగానే ఇప్పుడు కూడా తెలంగాణా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు ఆంధ్రా సర్కార్ కుట్రలు పన్నుతోందన్నారు.ఇది తెలంగాణా రాష్ట్రమని ఇక్కడ ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్నారని ,కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణా హక్కులను హరించే శక్తి ఏ ఒక్కరికి లేదని ఆయన తేల్చిచెప్పారు.
మద్రాస్ కు మంచినీళ్ళ పేరుతో దివంగత వై యస్ రాజశేఖర్ రెడ్డి నీళ్లను దోచుకపోయారన్నారు.ఆ తరువాత అదే కాలువలను వెడల్పు చేస్తూ పోయి 300 టి యం సి ల నీటిని రాయలసీమ కు తరలించుకు పోయేందుకు జగన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు.
వై యస్ అధికారంలో ఉన్నారోజున తెలంగాణా నాయకత్వం వారికి బానిసలుగా పని పనిచేశారని , నాగార్జున సాగర్ ఎడమకాలువ కింది ఆయకట్టు రైతాంగాన్ని 50 ఏండ్లుగా ద్రోహం చేసిన చరిత్ర ఆంధ్రా సర్కార్ దన్నారు.
ఎడమ ఎత్తులో ఉంటుందని కుడి కాలువ కింది భాగంలో ఉంటుందని దాన్ని ఆసరా చేసుకుని ఎడమ కాలువ భూముల్ని ఎండపెట్టిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులదని అన్నారు.
కృష్ణా డెల్టాకు అవసరమైన ప్రతి సందర్భంలో హుకుం లు జారీ చేయడం,దౌర్జన్యాలకు పాల్పడడం, అధికారులను బెదిరించడం వారికి పరిపాటుగా మారిందని అన్నారు.
రైతులు ఎక్కడైనా రైతులేనని ఇరు ప్రాంతాల రైతులకు ప్రయోజనాకారిగా ఉండే ఫార్ములాను కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ని అభినందించి ముందట పెడితే స్పందించకుండా ఇప్పుడు మూర్ఖపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.