ప్రజాభిప్రాయ సేకరణ అంటూ వెబ్ సైట్లో అందునా ఇంగ్లీష్ లో నోటీసా?

(EAS Sarma)
విశాఖ మహానగర అభివృద్ధి సంస్థ వారు మహానగర అభివృద్ధి ప్ప్రణాళిక 2006 లో మార్పులు చేస్తూ కొత్త ప్రణాళిక ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రచురించారు. ముసాయిదా ఆంగ్లభాషలోనే ఉంది కాని స్థానికమైన తెలుగులో ప్రచురించబడలేదు.
ఇటువంటి దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభావం ప్రజలమీద, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న సాంప్రదాయక మత్స్యకారులమీద, “మురికి” వాడలలో నివసిస్తున్న పేదల మీద, నగరానికి ప్రాణం పోస్తున్న కొండలు, అడవులు, సముద్ర ప్రాంతాల మీద తీవ్రంగా ఉంటుంది.
ఆంగ్లంలో ప్రచురించిన ప్రణాళిక ప్రజలకు అర్ధం కాకపోవడం వలన అటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అనుకున్న విధంగా ఉపయోగపడదు.
ఈ నేపథ్యంలో సాంప్రదాయిక మత్స్యకారుల తరఫున  విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయడం జరిగింది. లేఖ పాఠం ఇది.
“ముసాయిదా బ్రాహుత్ర ప్రణాళిక చిత్రపటము (డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్) మరియు జోనింగ్ నిబంధనలను  విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్ద వెబ్ సైట్ నందు ప్రజల విక్షిచటకు కొరకు. తేది: 15-06-2021 ఉంచడమైనదిని చెప్పడం జరిగింది. కాని వాస్తవంగా వారం రోజులు అయ్యాక పూర్తిగా పెట్టడం జరిగింది. ఈలోగా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియచేయవచ్చునుని చెప్పడం జరిగింది.  
“ఇక్కడ విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్ద, విశాఖపట్నం వారు వాళ్లకు అనుకూలంగా ఉన్న భాషలో మరియు ఎవ్వరికీ అర్థం కాని విధంగా ఈ డ్రాఫ్ట్ ముసాయిదా ప్రతిపాదనలను తయారు చేసి  ప్రజలు వీక్షించలేని వెబ్ సైట్ నందు ఈ ముసాయిదా ప్రతిపాదనలను పెట్టి విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఉన్న ప్రజలందరికి అన్యాయం చేస్తున్నారు.
“ఇప్పుడు వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్లానింగ్ మ్యాపాలు ఎవ్వరికి అర్థం కాని రీతిలో పెట్టడం జరిగింది. గతంలో ఉత్తర్వులు నెం:345/2006 వుడా వి.ఎం.ఆర్.-2021 మాస్టర్ ప్లాన్ తేది: 30-06-2006, తయారు చేసినప్పుడు కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఆదేశాలు(WP.No: 26966/2006)మొత్తం మాస్టర్ ప్లాన్ మన మాతృబాష ఉత్తర్వులు 420/2005 ప్రకారం తెలుగులోనే తయారు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టమని చెప్పడం జరిగింది. కాని ఇక్కడ అవీమి పట్టించుకోకుండా కనీసం ప్రజలకు వీటిమీద అవగాహన కోసం ఎలాంటి సదస్సులు/ సమావేశాలు నిర్వహించకుండా మాస్టర్ ప్లాన్ తయారు చేసే పనిలో VMRDA అధికారులు ఉన్నారు.
               
“కావున ఈ ముసాయిదా బ్రాహుత్ర ప్రణాళిక చిత్రపటము మరియు జోనింగ్ నిబంధనలను మన అధికారి భాష తెలుగులో విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఉన్న ప్రజలందరికి అందుబాటులో పెడతారని VMRDA వారిని కోరుతూ అలాగే ఈ ముసాయిదా బ్రాహుత్ర ప్రణాళిక చిత్రపటము మరియు జోనింగ్ నిబంధనలను పైన అవగహన కల్పించడానికి విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఉన్న ప్రజలందరితో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆశిస్తూన్నాను. అప్పటి వరకు తేది: 15-07-2021 వరకు గడువును పొడిగిస్తారని కోరుచున్నాను. లేనియెడల మరల న్యాయ స్థానాని అశ్రహించడానికి వెనకడం అని తెలియజేసికుంటున్నం.”  
2006 లో ఇటువంటి ప్రణాలికను ఇదే విధంగా ఆంగ్లంలో ప్రచురించినప్పుడు, అప్పటి రాష్ట్ర హై కోర్టు వారు ఒక ప్రజా వాజ్యం (WP 26966/2006) లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలుగులో ప్రచురించక పోతే చెల్లదని ఉత్తరువులు ఇవ్వడం జరిగింది.
EAS Sarma IAS (rtd)
అయినా అధికారులు మళ్ళీ ముసాయిదాను తెలుగులో ప్రజలకు అందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ముసాయిదాను నూటికి నూరు పాళ్ళు తెలుగులోనికి తర్జుమా చేసి తెలుగు ముసాయిదాను ప్రజల ముందు పెట్టవలసినది. లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ చెల్లదు.
మీరు విశాఖ మహానగర అభివృద్ధి సంస్థకు తగిన విధంగా ఈ విషయం లో ఆదేశాలను ఇవ్వాలని కోరుతున్నాను. తెలుగు ముసాయిదాను ప్రజల ముందు పెట్టిన తరువాత, ప్రజాభిప్రాయ సేకరణ కోసం మూడు నెలల వ్యవధి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
(EAS Sarma, former GOI secretary)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *