ప్రమోషన్ల మీద ఆంధ్ర రెవిన్యూ ఉద్యోగుల హర్షం

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కోరిక మేరకు, రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ తహశీల్దార్ నుండి
తహశీల్దారుల పోస్టుల పదోన్నతుల కొరకు జరిగిన డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (DPC) ద్వారా అనేకమందికి రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ లుగా పదోన్నతులు కల్పించినందుకు APRSA తరుపున గౌరవ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు సి.సి.ఎల్.ఏ ని ఈ రోజు కలిసి APRSA పక్షాన    కృతజ్ఞతలు తెలియజేశారు.

బొప్పరాజు, చేబ్రోలు కృష్ణ మూర్తి, V. గిరి కుమార్ రెడ్డి, శర్మ, B.ఫుల్లయ్య తదితరులు సీసీ ఎల్ ఏ ని కలిసిన వారిలో ఉన్నారు

ఈ సందర్భముగా బొప్పరాజు గారు మాట్లాడుతూ దాదాపు 30 -35 సంవత్సరాల పాటు రెవెన్యూ శాఖలో సుదీర్ఘమైన సేవలు అందించి, సర్వీస్ చివరి రోజుల్లో తహసీల్దార్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేయడం అనేది ప్రతి రెవెన్యూ ఉద్యోగి కల అన్నారు. అటువంటి కలను ఇటువంటి తీవ్రమైన కోవిడ్ సమయంలో కూడా నెరవేర్చినందుకు CCLA నీరబ్ కుమార్ ప్రసాద్,  DPC కమీటీ సభ్యులైన శ సిద్ధార్థ్ జైన్ IAS (కమిషనర్, సర్వే సెటిల్మెంట్) గారికి,  చక్రవర్తి, IAS (సెక్రటరీ to CCLA) గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

డిప్యూటీ తహశీల్దార్ నుండి తహసీల్దార్ గా పదోన్నతులు జోన్ -I (వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం) నుండీ 45 మంది, జోన్-II (తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా) నుండీ 34 మంది, జోన్- III ( గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) నుండీ 35 మంది, జోన్-IV (చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు) నుండి 38 మందికి ఈ DPC ద్వారా తహశీల్దార్ లుగా పదోన్నతులు పొందడం జరిగింది.

వీరందరికి వారి వారి జిల్లాలో ఉన్న ఖాళీల ప్రకారం జిల్లా కలెక్టర్లు పోస్టింగులు ఇవ్వడం జరుగుతుంది.

కోవిడ్ టైములో కూడా డి.పి.సి జరిపి దాదాపు రాష్ట్ర వ్యాప్తముగా 152 మందిని తహశీల్దారులుగా ఒకేసారి పోదోన్నతులు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ గొప్ప విషయమని అన్నారు. అలాగే ప్రభుత్వము నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడములో ప్రతి రెవిన్యూ ఉద్యోగి నిరంతరము శ్రామిస్తున్నారని, ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో ‘ఇన్సిడెంట్ కమాండర్ ‘ లుగా వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ విధులను నిర్వర్తిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఇదేవిధంగా కష్టపడి పనిచేస్తామని తెలియజేశారు.

ఇందుకు Spl చీఫ్ సెక్రెటరీ మరియు సి.సి.ఎల్.ఏ గారు స్పందిస్తూ నూతనంగా తహశీల్దార్లుగా పదోన్నతులు పొందిన అందరూ ప్రభుత్వము నిర్ధేశించిన రి సర్వే ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *