వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ని తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకే ప్రారంభిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్శంగా ఆమె పార్టీ వైబ్ సైట్స్ ను ప్రారంభించారు. పార్టీలకు ఇపుడు సోషల్ మీడియా అవసరం ఉందని చెబుతూ టిఆర్ ఎస్ పార్టీకి సోషల్ మీడియా వింగ్ లో వేలమంది ఉద్యోగులున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీకి ఉద్యోగులు అవసరంలేదని, వైఎస్ ఆర్ అభిమానులున్నారని,వారంతా మనస్ఫూర్తిగా పనిచేసే వారియర్స్ (యోధులు) అని ఆమె ప్రశంసించారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదిక లనుంచి వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని ప్రోత్సహించండి,ముందుకు తీసుకువెళ్లండి, పార్టీకి సంబంధించిన ప్రతిఅంశాన్ని ఈవేదికల మీది నుంచి ప్రచారం చేయండన అని ఆమె పిలుపునిచ్చారు.
పేదవాడు మళ్ళీ తలెత్తుకు తిరిగేలా..రైతుకు అండగా, మహిళలకు భరోసాగా..సోషల్ మీడియాదే కీలక పాత్ర.https://t.co/g6atiiJWRa
— YS Sharmila (@realyssharmila) June 30, 2021