ఆశాజనకంగా తెలంగాణలో వర్షాలు

 

(సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి)

– జూన్ మాసాంతానికి సాధారణ వర్షపాతం 130 ఎంఎంకు గాను 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం

– ఆదిలాబాద్ లో అత్యధికంగా 318.7 మిల్లీమీటర్లు, వనపర్తిలో అత్యల్పంగా 76.8 మిల్లీమీటర్లు

Singireddy Niranjan Reddy

– మొత్తం 33 జిల్లాలలో ఆరుజిల్లాలు మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి , వికారాబాద్ జిల్లాలలో సాధారణ వర్షపాతం కురియగా, మిగతా 27 జిల్లాలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయింది

– గత ఏడాది ఈ సమయానికి 171.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది

– రాష్ట్రవ్యాప్తంగా 141.12 లక్షల ఎకరాలలో సాగు ప్రణాళిక అంచనా వేయగా ఇప్పటి వరకు 34.35 లక్షల ఎకరాలలో అంటే 25 శాతం పంటల సాగు

– ప్రధాన పంటలయిన పత్తి 26.05 లక్షల ఎకరాలు, కంది 3.18 లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది .. 96 వేల ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది

– దాదాపు 50 వేల ఎకరాలలో పెసర, లక్ష ఎకరాలలో మొక్కజొన్న సాగు నమోదయింది

– ఇవికాకుండా 87 వేల ఎకరాలలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగు నమోదయింది

– 5.7 లక్షల ఎకరాలలో పండ్ల తోటలు, బహుళ వార్షిక ఉద్యానపంటలు సాగవుతున్నాయి

– ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పత్తి, కంది సాగు క్షేత్రస్థాయిలో ఎక్కువగా నమోదవుతుంది .. రైతు సోదరులు దీనిని కొనసాగిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, పప్పుదినుసులు, నూనెగింజల పంటలనే ఎక్కువగా సాగు చేయాలి

– వరి సాగును తగ్గించాలని విజ్ఞప్తి

– ఈ వానాకాలానికి 25.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను 8.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, 4.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది

– జూన్, జులై నెలలకు కేంద్రం కేటాయించిన ప్రకారం ఎరువులను దిగుమతి చేసుకోవాలని, తెలంగాణకు కేటాయించిన కోటా ప్రకారం వివిధరకాల ఎరువులు ఏ దేశం నుండి, ఏ పోర్టులకు వస్తున్న విషయం ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది

– వెజల్స్ వారీగా కేంద్రం ఎరువులు కేటాయింపులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలిచ్చాము.

– రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.7360.41 కోట్ల రైతుబంధు నిధులు 60.84 లక్షల మంది రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది

– వ్యవసాయరంగానికి చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం జరిగింది

– రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి

– ఇప్పటి వరకు 325 క్రిమినల్ కేసులు, 518 మంది అరెస్టు, 25.7 కోట్ల విలువగల 11,848 క్వింటాళ్ల విత్తనాలు సీజ్, 78 కోట్ల విలువగల 23,720 క్వింటాళ్ల విత్తనాల అమ్మకాలు నిలిపివేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *