ఆంధ్రాకు కరెంటు షాక్ ఇచ్చిన తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణల మధ్య జలయుద్ధం ముదురుతూ ఉంది. ఇపుడీ వివాదంలోకి  తాజా విద్యత్తుకూడా ప్రవహించి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి ని ఖాతరుచేయకుండా తెలంగాణలో నూరు శాతం జలవిద్యుత్ ను ఉత్పత్తి చేయాలని జెన్ కో కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కెసి ఆర్ స్వయంగా ఇలా ఆదేశించడంతో  విద్యుత్ శాఖ తెలంగాణ జెన్కో కు  100 శాతం విద్యదుత్పాదన చేయాలని ఆదేశాలు జారీ చేసి రెండు రాష్ట్రాల మధ్య వివాదం తీవ్రమయ్యేందుకు బాట వేసింది.

ఇలా ఏకంగా ఆదేశాలు జారీ చేయడం సాధారణంగా జరగదు. ఇది ముఖ్యమంత్రి జగన్ మీద ఎక్కుపెట్టిన భాణమే. రెండు రాష్ట్రాలు వ్యవసాయానికి, కరెంటుకు కృష్ణానది మీద ఆధారపడిఉన్నందున, ఈ తాజా ఉత్తర్వులు ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉద్రికత్త పెంచుతాయి. కెసిఆర్ రెండో విడత ముఖ్యమంత్రి అయ్యాక, అక్కడ ఆంధ్రలో చంద్రబాబు ఓడిపోయి, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు రాష్ట్రాల మధ్య పెద్ద ఉద్రిక్తత చోటు చేసుకోలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉన్నట్లు ప్రపంచానికి కనిపించారు. ఇప్తార్ లలో కలుసుకున్నారు. పూజల్లో కలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవం లో కలుసుకున్నారు. విబేధాలను  పరిష్కరించుకోలేకపోయినా, ఇద్దరు ముఖ్యమంత్రులు శాంతియుతంగాఉన్నారు. అయితే, శాంతిపర్వం ముగిసినట్లే ఉంది.


ఇది కూడా చదవండి

కెసిఆర్ – జగన్ కు ఇప్పుడే ఎందుకు బెడిసింది?


ఎందుకంటే,  ఈ నెల 25న కృష్ణ నది జల నిర్వహణ మండలి ( Krishna River Management Board KRMB)కి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఒక లేఖరాస్తూ శ్రశైలం రిజర్వాయర్ ఎడమ వైపునుంచి తెలంగాణ జలవిద్యుత్తు జరపకుండా నిలిపివేయలని కోరింది.  రిజర్వాయర్ నీటి మట్టం పడిపోతూ ఉందని, ఇలాంటపుడు  విద్యుదుత్పాదన చేయడం నాగార్జున సాగర్, క్రిష్ణా డెల్టా సిస్టమ్ నీటి పారుదల నియమాలకు వ్యతిరేకం నాగార్జున సాగర్, కృష్ణాబరాజ్ నుంచి వ్యవసాయానికి నీటిని విడుదల చేసినపుడే విద్యుదుత్పాతన చేయాలి. శ్రీశైలం రిజర్వాయర్ లోకి నీరు రావడం లేదు. అందువల్ల విద్యుదుత్పాదన పేరుతో రోజూ 12,000 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తే, రిజర్వాయర్ కనీస నీటి మట్టం నిర్వహించడం కష్టం అని అంధ్ర ప్రదేశ్ ఈ లేఖలో పేర్కొంది. ”It is to inform that depletion of Srisailam  reservoir  water through power houses for generation is against the operational protocol for irrigation requirements of the Nagarjunasar Project (NSP) system and Krishna Delta system. The power generation in power jouses at Srisailam shall be done only when water is released to NSP and Prakasam barrage  for  Irrigation requirements.. The inflows into the project were nil and water withdrawal through the left bank power house at the rate of 12,000 cusecs per day will adversely affect the maintenance of the reservoil  level,” అని ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్  నారాయణ రెడ్డి కృష్ణా  బోర్డు కు లేఖ రాశారు.

అయితే రాసిన సరిగ్గా మూడు రోజులకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తూ 100 శాతం విద్యుదుత్పత్తి చేయండని పేర్కొంది.  ఆంధ్రలో రిజర్వాయర్ లో నీళ్లు తక్కువవుతున్నాయని వాదిస్తే, తెలంగాణ లో లిఫ్ట్ ప్రాజక్టుల రాకతో విద్యుత్ అవసరాలు పరిగాయని, దీనికి తగినంత విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుదుత్పాతన చేయాలని తెలంగాణ  ప్రభుత్వం వాదిస్తూ ఉంది.

దీనిని  సమర్థించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు 100 శాతం విద్యుత్తును ఉత్పత్తిచేయాలని తెలంగాణ    ప్రభుత్వం టీఎస్‌ జెన్కోను ఆదేశించింది.

“While there is a  huge power requirement,  the TSGenco is not generating hydel power to its full capacity. The present capacity 2,500 MW a day is much lower than the requirement. So, the Genco chairman and managing director have been directed to take steps for enhancement of hydel power generation,”అని సందీప్ కుమార్ సుల్తానియా విద్యుత్ శాఖ కార్యదర్శి టైమ్స్ ఆప్ ఇండియా కు తెలిపారు.

తెలంగాణ లో దాదాపు 2,500 మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయగల ప్రాజెక్టుల్లో వందశాతం ఉత్పత్తి చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఎన్నడూ ఇలా ఆదేశించిన దాఖలాలు లేవు.

కృష్ణానది నుంచి  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న ఆరోపణలు చేస్తూ తమ దారి తాము చూసుకుంటాం అనే దోరణిలో తెలంగాణ జల విద్యుదుత్పత్తిపై దృష్టి సారించింది.

రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల పథకాలకు  భారీ స్థాయిలో విద్యుత్తు అవసరమవుతున్నది. తెలంగాణలో కృష్ణానదిపైనే జల విద్యుత్తు ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు ఉన్న జలవిద్యుత్తు ప్రాజెక్టుల్లోనే సుమారు 2,370 మెగావాట్ల వరకు జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వద్ద 1,715.60 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులున్నాయి. సాగర్‌ ఎడమ కాల్వపై 60 మెగావాట్లు, జూరాల, లోయర్‌ జూరాల ప్రాజెక్టుల వద్ద 474 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులున్నాయి. పులిచింతల వద్ద 120 మెగావాట్లు.. మొత్తంగా కృష్ణానదిపైనే 2,370 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులు, 11.16 మెగావాట్ల మినీ హైడల్‌ ప్రాజెక్టులు కలుపుకొని 2441.71 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి.

ఇలాంటపుడు 100 శాతం విద్యుదుత్పాదన చేయాలని ఆధేశించడం ఆంధ్రా లేఖను ఖాతరు చేయనవసరంలేదని చెప్పడమే

మొత్తానికి  రెండురాష్ట్రాల మధ్య జలవివాదానికి ఇపుడు ఆజ్యం తోడయింది. ఇపుడు ఆంధ్ర ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *