ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఎంతో విలక్షణమైన నేత.
రాజకీయ నేత అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉంటారు.
నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు ఇష్టపడతారు.
తాజాగా సీతక్క తన నియోజకవర్గంలోని ఓ మారుమూల తండాలో పర్యటించారు.
ఈ సందర్భంగా అక్కడి పాఠశాలలో చిన్నారులకు తినుబండారాలు, ఆట వస్తువులు అందించారు. వారితో ముచ్చటించారు.
ఇక, అక్కడే ఓ బాలిక చంకలో పసిబిడ్డను ఎత్తుకుని కనిపించడంతో సీతక్క ఆశ్చర్యపోయారు.
ఆ బాలికను ‘ఎంత వయసు?’ అని అడిగారు.
ఆ అమ్మాయి ’14 ఏళ్లు’ అని చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు ‘ఇంత చిన్నవయసులోనే తల్లయ్యావా? ఆరోగ్యం ఎలా ఉంటోంది? నువ్వు బాగా చదువుకుని ఉండుంటే ఇక్కడి స్కూల్లో నిన్నే టీచర్ గా నియమించేదాన్ని కదా చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసుకోవద్దు’ అంటూ హితబోధ చేశారు.