కరోనా బాధితుల ఆదుకోవాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ ఈ రోజు పార్టీ జాతీయ కార్యాలయంలో సాధన దీక్ష ప్రారంభించింది. ఈరోజు ఉదయం తొమ్మిది 45 నిమిషాలకు దీక్ష ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.
LIVE coverage of “Sadhana Deeksha” under the leadership of Sri @ncbn to demand the Andhra Pradesh government to extend financial support to Coronavirus victims in the State. – LIVE from NTR Bhavan, Amaravati. https://t.co/WV7MvMbkii
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) June 29, 2021
రాష్ట్రంలోని ప్రతి కరోనా మరణానికి జగన్ రెడ్డే కారణమని , ఆయననియంతృత్వ పోకడలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే.. కేసులు పెట్టడంపైనే దృష్టి పెడుతున్నారని, రాష్ట్రంలోని మందులు కూడా మనం వినియోగించుకోలేకపోతున్నామని వారు విమర్శించారు.
ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కూడా అందుబాటులో లేవు
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని టిడిపినేతలు పేర్కొన్నారు. దీక్షలో మాజీ మంత్రులు దేవినేని ఉమ,కాలువశ్రీనివాసులు, కొల్లు రవీంద్ర,నక్కా ఆనంద్ బాబు ఇతర నేతలువంగలపూడి అనిత, కూన రవికుమార్, బోండ ఉమ తదితరులు పాల్గొన్నారు.