కృష్ణా జలాలకు సంబంధించి వైెైఎస్ రాజశేఖర్ రెడ్డిని దొంగ అని, ఆయన కుమారుడు గజదొంగ అని తెలంగాణలో మంత్రులు క్యాంపెయిన్ చేస్తున్నపుడు వైఎస్ కూతరు తెలంగాణ పక్షం నిలబడ్డారు.
తన పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అనే పక్షపాతం చూపకుండా మెట్టినిల్లే తనకు ముఖ్యమని ఆమె ప్రకటించారు.
జూలై 8న ఆమె తెలంగాణలో వైఎస్ పేరు మీద పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈలోపు నీళ్ల వివాదాలకు సంబంధించి తాను తెలంగాణ పక్షమేనని ట్వీట్ చేశారు.
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం..
అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం..
అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..https://t.co/Kc6F1vkpLW— YS Sharmila (@realyssharmila) June 28, 2021