కొత్త పిసిసి సభ్యులు నన్ను కలవొద్దు. పిసిసి రేసులో ఓడిపోయిన కోమట్టి రెడ్డికి ఆగ్రహంతో అన్నమాట ఇది. గాంధీభవన్ టిడిపి ఆఫీస్ అవుతున్నదని ఆయన అన్నారు. బహుశా ఆయన గాంధీ భవన్ కు ఇక రారేమో. ఆయన రాజకీయ కార్యక్రమం ఎలా ఉంటుందో బయటపెట్టలేదు గాని, పాదయాత్ర చేస్తానంటున్నారు. కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రాకతో అసంతృప్తి మొదలయింది.అధిష్టానం దీనిని చల్చార్చేందుకు దూతలను పంపిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని కోమటిరెడ్డి వ్యాఖ్యలు:
ఓటుకు నోటు లాగా పీసీసీ పదవిని అమ్ముకున్నారు. పార్టీలు మరీన వారికి పీసీసీ పదవి ఇచ్చారు . ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ డబ్బులు తీసుకొని పీసీసీ పదవిని కట్టబెట్టారు. రేవంత్ కు పీసీసీ రావడంలో చంద్రబాబు పాత్ర ఉంది. పీసీసీ పదవి ఎలా వచ్చిందో తెల్సు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆధారాలతో సహా బయట పెడుతాను. మా నియోజకవర్గలో మాత్రమే పరిమితమవుతాను. ఇక పై గాంధీభవన్ మెట్లు ఎక్కను. కొత్త యువతను ప్రోత్యహిస్తాను. నా రాజకీయ భవిష్యత్తు ను కార్యకర్తలే నిర్ణయిస్తారు.