వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణా నది నుంచి అక్రమనీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని కేంద్రానికి అబద్ధాలు చెప్తూ ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు లు నిర్మిస్తోందని తెలంగాణ రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి దొంగతనానికి సంబంధించి మంత్రి వేముల ప్రశాంత రెడ్డి అన్నమాటలు నూటికి నూరు శాతం నిజమని ఆయన వత్తాసుపలికారు. గత వారం రోజులు తెలంగాణ మంత్రులంతా అవకాశం దొరికినపుడల్లా, కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకుపోవడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే, ఆయన కుమారుడు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకన్నా పెద్ద దొంగ అని ప్రచారం చేస్తున్నారు.
మొదట వేముల ప్రశాంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లె లో మాట్లాడుతూ ఈ విమర్శ చేశారు. తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి దానిని పురురుద్ఘాటిచారు. ఇపుడు మరొక మంత్రి పువ్వాడ వేముల అన్నది కరెక్టే నంటున్నారు.
పువ్వాడ అజయ్ ఇంకా ఏమన్నారంటే…
*తెలంగాణ పట్ల ఎపుడూ వివక్ష చూపిన కుటుంబం వైఎస్ కుటుంబం
* తెలంగాణ పట్ల తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి.
* ఆనాడే వైఎస్సార్ తెలంగాణ లో ఒకలా/ ఏపీలో మరోలా మాట్లాడి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారు.
* శ్రీశైలం ప్రాజక్టు ప్రాథమికంగా పవర్ ప్రాజక్టు, తెలంగాణ పవర్ ప్రొడక్షన్ ఆపేయాలనే హక్కు ఆంధ్రాకు లేదు.
* రెండు రాష్ట్రాల ప్రజల బాగు కోసం కేసీఆర్ రాయలసీమకు నీళ్లు ఇస్తాం అనే మాటలను ఏపీ నేతలు వక్రీకరిస్తున్నారు
*ట్రిబ్యునల్ లో రెండు రాష్ట్రాల నీటి వాటాలను ఇంకా తేలలేదు.
* తెలంగాణ నుంచి అక్రమంగా 7 మండలాలలో పోలవరం కట్టి ఒక్క ఏకరానికి నీళ్లు రావడం లేదు.
* తెలంగాణ ప్రజల హక్కుల కోసం మేము మాట్లాడుతున్నాము- మా హీరోయిజం కోసం కాదు.