ప్రతి ఇల్లూ ఆరు మొక్కలు నాటాల్సిందే: కెసిఆర్

రాష్ట్ర స్థాయి అధికారులు మంత్రుల పర్యటన ల సందర్భంగా వారి సౌకర్యార్థం ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయం లో ” రాష్ట్ర చాంబర్” ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన పల్లె ప్రగతి, పట్టణప్రగతి, హరిత హారం గురించి ప్రగతి భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు కలెక్టర్లకు ఆయన లక్ష్యం నిర్దేశించారు. పల్లె ప్రగతి కింద వూర్లోని ప్రతిఇల్లు ఆరు మొక్కలు నాటి తీరాలని, ఈ మొక్కలను అధికారులకు గ్రామంలోని ప్రతి ఇంటికి చేర్చాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ శాఖల కు సంబంధించిన భూములు స్థలాలు ఇతర ఆస్తుల వివరాలను.. (“ఇన్వెంటరీ ” లను) జూలై నెలా ఖరు కల్లా సిద్దం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

 కెసిఆర్ ఇచ్చిన మరికొన్ని ఆదేశాలు

ప్రభుత్వ శాఖల, భూములు ఆస్తుల వివరాలను రికార్డు చేయడానికి, సంరక్షణ,పర్యవేక్షణ కోసం జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్ ను నియమించాలి.. వీరు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పని చేయాలి. రాష్ట్ర స్థాయి ఎస్టేట్ ఆఫీసర్ ను నియమించి సిఎస్ పర్యవేక్షణ లో విధులు నిర్వహించేలా చూడాలి.

పల్లెలు పట్టణాల అభివృద్ది కోసం ఖర్చు చేసేందుకు మంత్రుల వద్ద 2 కోట్లు, ప్రతి జిల్లా కలెక్టరు కు ఒక కోటి రూపాయల ఫండ్ ను కేటాయిస్తున్నా.

ఎమ్మెల్సీ లు ఎమ్మేల్యేలు నియోజకవర్గ అభివృద్ది నిధులను (సిడిఎఫ్) స్థానిక జిల్లా మంత్రి నుంచి అప్రూవల్ తీసుకొని ఖర్చు చేయాలి.

గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొవాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలి.

కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లే అవుట్ లను అనుమతించ వద్దు. నూతన చట్టాల లోని నిబంధనలను విధిగా అమలు పరచాలి.

వలస కార్మికుల పాలసీ’ ని రూపొందించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *