ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏయే ట్రీట్ మెంట్ కు ఎంత చార్జ్ చేయాలో నిర్ణయిస్తూ తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ (G.Q.Rt.No.401 తేదీ 22.06.2021)) జారీ చేసింది.
‘‘సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా ₹4వేలకు మించి వసూలు చేయరాదు. ఐసీయూ గదిలో రోజుకు గరిష్ఠంగా ₹7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా ₹9వేలు చార్జి నిర్ణయించారు. పీపీఈ కిట్‌కు ₹273 ధర నిర్ణయించారు.
ఇన్వెస్టిగేషన్స కు సంబంధించిన రేట్లు
హెచ్ ఆర్ సీటీ- ₹1,995, డిజిటల్ ఎక్స్ రే- ₹1300, ఐఎల్6- ₹1300, డీడైమర్- ₹300, సీఆర్పీ- ₹500, ప్రొకాల్ సీతోసిన్- ₹1400, ఫెరిటీన్- ₹400, ఎల్ డీహెచ్- ₹140లుగా నిర్ణయించారు.
అంబులెన్స్ చార్జీలు
సాధారణ అంబులెన్సుకు కనీస ఛార్జి ₹2వేలు- కి.మీకు ₹75’’ ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.