2021 మార్చి 5న నాసా (NASA) అంగారకుడి మీదకు అంతరిక్ష నౌకను పంపిస్తున్న బృందంలో భారతీయ సంతతి వారు ఎక్కువగా ఉండటం చూసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమన్నారో గుర్తుందా?
ఇండియన్ అమెరికన్లు అమెరికాను అక్రమిస్తున్నారు (Indian-Americans are taking over the US) అని అన్నారు.
నాసా గైడెన్స్ కంట్రోల్ అపరేషన్స్ చీఫ్ గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన స్వాతి మోహన్ ను అభినందిస్తూ ఆయన ఈ మాట అన్నారు . నాసా పంపిన రోవర్ అంగారకుడి మీద అనుకున్నచోట దింపే బాధ్యత ఆమెదే. రోవర్ అనుకున్న చోట దిగిందని మొదట నిర్ధారించింది ఆమెయే. ఆమెను అభినందిస్తూ బైడెన్ ఇలా వ్యాఖ్యానించారు.
“It’s amazing. Indian-descent Americans are taking over the country- you, my vice president(Kamala Harris), my speechwriter(Vinay Reddy).”అని అన్నారు.
ఆయన అసూయతో అనలేదు. ఆయన మాటల్లో ద్వేషం లేదు. చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడారు. గర్వపడుతూ అన్నారు.
ఎందుకంటే మార్చి అయిదునుంచి ఇప్పటివరకు భారతీయ సంతతివారిని బైడెన్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో నియమించడం ఆగిపోలేదు.
నాసా నుంచి వైట్ హౌస్ దాకా భారతీయ సంతతి సైన్యం పెరుగుతూనే ఉంది. తాజాగా కిరణ్ అహూజా అమెరికా సిబ్బంది విభాగానికి డైరెక్టక్టర్ గా నియమితులయ్యారు.
ఆమె పేరును వైట్ హౌస్ ఫిబ్రవరి 13న నామినేట్ చేసింది. జూన్ 15నేఖరారుకావలసి ఉండింది. ఈరోజు ఇద్దరు సెనెట్ కమిటీ సభ్యులు హియరింగ్ కు రాకపోవడంతో వాయిదా పడింది. ఆమె నియామకం జూన్ 22న ఖరారయింది.
సెనెట్ కమిటీ ఆమెను అనేకరకాలు ప్రశ్నలు వేసి, పరీక్షించి నియామకాన్ని 51-50 మెజారిటీ ఖరారు చేసింది. ఆమె ఇపుడు ఆఫీస్ ఆఫ్ పర్సొనెల్ మేనేజ్ మెంట్ (OPM) డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికి ఆమె చీఫ్ అన్నమాట. ఫెడరల్ గవర్నమెంట్ HR చీఫ్. ఇది చాలా కీలకమయిన ,బాధ్యతాయుతమయిన పదవి.
కిరణ్ అహూజా వయసు 49సంవత్సరాలు. ఆమె న్యాయ శాస్త్రం చదువుకున్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె ప్రస్తుతం ఫిలాంథ్రొఫీ నార్త్ వెస్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ఆమె పూర్తి పేరు కిరణ్ అర్జన్ దాస్ ఆహూజా. 1971 జూన్ 17న ఆమె ఇండియాలో జన్మించారు. జార్జియా సవన్నా లో పెరిగారు. జార్జియా యూనివర్శిటీ లా స్కూల్ లో చదువుకున్నారు. పౌరహక్కుల న్యాయవాదిగా,యూనివర్శిటీ లో ప్రొఫెసరగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో 2015-17 మధ్య సిబ్బంది శాఖ లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు. 21లక్షల మంది ఫెడరల్ ప్రభుత్వ సిబంది నియామకాలు రిటైర్ మెంట్లు, పెన్సన్ లు, ఇన్యూరెన్స్ వ్యవహారాలన్నింటిని ఈ శాఖయే చూస్తుంది. చూస్తూంది.దీనికిఆమె డైరెక్టర్.
తొలినుంచి ప్రెశిడెంట్ బైడెన్ తన ప్రభుత్వంలో భిన్నత్వానికి పెద్ద పీట వేస్తానని చెబుతున్నారు. బహుశా ఇందులో భారతీయ సంతతి వారికే పెద్ద పీట వేస్తున్నారేమో అనిపిస్తుంది. బైడెన్ అధ్యక్షుడవగానే 20 భారతీయ సంతతి వారిని ఉన్నత స్థానాల్లో నియమించడమో, నియామకానికి నామినేట్ చేయడమో జరిగింది. ఇందులో 13 మంది మహిళలున్నారు.ఈ ఇరవై మంది లో 17 మంది వైట్ హౌస్ కాంప్లెక్స్ లోకీలకమయిన హోదాల్లో తిష్ట వేశారు. ఇది అమెరికాలోనే జరుగుతుందేమో.