ధైర్యంగా రెండు రకాల వ్యాక్సిన్ తీసుకున్న జర్మనీ అధినేత్రి మెర్కెల్

ఇండియాలో ఇంకా తేల్చుకోలేకపోతూనే ఉన్నారు.  కోవిడ్ రాకుండా నివారించేందుకు రెండు డోసులు వ్యాక్సిన్  ఒకే కంపెనీవి తీసుకోవాలా లేక వేర్వేరు కంపెనీలవి తీసుకోవచ్చా అనే చర్చ ఇండియాలో  సాగుతూనే ఉంది.

ఆ మధ్యఉత్తర ప్రదేశ్ లో ఒక గ్రామంలో రెండోడోస్ వేసే టప్పటికి మొదటి డోస్ కువ్యాక్సిన్ అందుబాటులో లేకుండాపోయింది. మరొక  వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. ముందువెనకచూడకుండా వేసేశారు. ఆతర్వాత  నిపుణులంతా తలబాదుకున్నారు. కొందరు రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకుంటే తప్పు లేదన్నారు. మరికొందరేమోసైన్స్ పాఠాలు చెప్పారు. వ్యాక్సిన్ భిన్నమయిన ప్లాట్ ఫార్మ్ మీద తయారవుతాయి. అందువల్ల అవి పనిచేసే తీరు వేర్వేరుగా ఉంటుంది కాబట్టి రెండు వేర్వేరు వ్యాక్సిన్ లు తీసుకోరాదని చెప్పారు.చర్చలకు ఇండియాలో చాలా ప్రాముఖ్యమిస్తారు. ఇలా ఇండియన్లు చర్చిస్తూనే ఉన్నారు. అసులు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా, వ్యాక్సిన్ అనేది నిజమా భ్రమయా, ఆల్లోపతి వాడాలా ఆయుర్వేదం వాడాలా… ఇలా ఇండియాలో చర్చ అనంతంగా సాగుతూ ఉంది.

ఈలోపు ఈలోపు జర్మనీ అధ్యక్షురాలు (చాన్స్ లర్) ఎంజెలా మెర్కెల్  కామ్ గా రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. వయసు వైపు చూడకుండా, మొదటి డోస్ యాస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)ని ఏప్రిల్ లో  తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ 60 సంవత్సరాల పైబడిన వారికి వాడేందుకు జర్మనీ

అధికారులు అనుమతిచ్చిన రెండు వారాల్లో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో డోస్ గా మంగళవారం నాడు మాడెర్రనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

తర్వాత యాస్ట్రా జెనెకా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్ మరొక వ్యాక్సిన్ తీసుకోవచ్చని  జర్మనీ నిపుణులు సిఫార్సు చేశారు. చాలా యూరోపియన్ దేశాలు కూడా ఇదే పనిచేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *