బీబీ నగర్ మండలంలో ‘క్రికెట్ కరోనా’

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంల ముగ్ధంపల్లి గ్రామంలో ఈ కరోనా కలకలం చెలరేగింది. ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తూఉంది. చిత్రమేమిటంటే  వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడారు.  అక్కడ ఒకరి నుండి మరొకరికి కరోనావైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఈ గ్రామనికి  చెందిన 35 మంది యువకులు కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడారు. కొద్ది రోజుల తర్వాత వారిలో కొంతమంది యువకులు కోవిడ్ లక్షణాలతో బాధపడటం మొదలుపెట్టారు. వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ అనే తేలింది. దీనితో అందరికి పరీక్షలు చేశారు.  35 మంది యువకులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారని 10tv సమాచారం.

ఇపుడు తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. దీనితో ప్రజలంతా కరోనా పోయిందనే భావనతో ఉన్నారు తప్ప, లాక్ డౌన్ వల్ల పోయినవి ప్రజల కదలికల మీద ఉన్న ఆంక్షలు నిషేధాలు మాత్రమే అని అనుకోవడం లేదు. చుట్టూర సమాజంలో కరోనా మాయం కాలేదు. అయితే, లాక్ డౌన్ ను తప్పుగా అర్థం చేసుకుని విచ్ఛలవిడిగా ప్రవర్తిస్తే ఏమవుతుందో అనేందుకు బీబీనగర్  క్రికెట్ కరోనా యే సాక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *