రు.150 వైపు పరుగుతీస్తున్న లీటర్ పెట్రోలు ధర

దేశంలో  లీటర్ పెట్రోలు ధర రు.150 వైపు  పరుగుతీస్తున్నది. అదే విధంగా లీటర్ డీజిల్ తొలిసారి ధర రు. 100 దాటింది.

ఇపుడు పెరుగుతున్న వేగంతో పెరిగితే, సెప్టంబర్, అక్టోబర్ నాటికి లీటర్ పెట్రోలు కొనేందుకు  రు. 150 పెట్టాల్సి వస్తుంది.

పెట్రోలు డీజిల్ ధరలుఇలా పెరిగితే, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతాయి. దీనికి తోడు కోవిడ్ తో చాలా పేదకుటుంబాల ఆదాయం పడిపోయింది. మరికొన్ని కుటుంబాలు కోవిడ్ బారిన పడి ఇక జీవితంలో కోలుకోలేనంతగా పతనమయ్యాయి.

ధరలు పెరిగే కోవిడ్ బాధిత కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.  కోట్లాదిగా ఉన్న ఇలాంటి వారి గురించి రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్ మీద తాము విధిస్తున్న పన్నులు తగ్గించుకునే ప్రస్తావనే రాదు. అందువల్ల దేశ ప్రజలంతా లీటర్ పెట్రోలు ధర రు.150 వైపు  తీస్తున్న పరుగును ఆందోళనతో చూస్తూకాలం గడపక తప్పదు.

నిజానికి అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోలు డీజిల్ ధరలు  పెరుగుతూనే ఉన్నాయి.  తాము గెలిపించుకున్న ప్రభుత్వం ఏంత ధరలు పెంచిన ఓటర్లు భరిస్తారనే నమ్మకం పార్టీలకు ఉంది. అందుకే  నిత్యావసరం వస్తువుల ధరలన్నీ పెరుగుతూనే ఉన్నా దేశం ప్రశాంతంగా ఉంది.

మేనాలుగో తేదీనుంచి అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు ఓడిదుడుకులకు లోనవుతున్నా,  ఇండియాలో ధరలు పెగుగుతున్నాయంటేరాజకీయ రహస్యం ఏమిటి?

ఉదాహరణకు మే 20వ తేదీన బ్రెండ్ క్రూడ్ ధర 65.11 డాలర్లుండింది. అది గత 46 రోజులలో అతి తక్కువ ధర. అయితే, ఆ మరుసటి రోజునే  పెట్రోల్ ధర లీటర్ కు 19 పైసలు,  డీజిల్ ధర 29 పైసలు పెరిగింది.

 

మే నాలుగో తేదీనుంచి  అంటే గత నలభై రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు  17 సార్లు పెరిగాయి.   ఈ మధ్య కాలంలో పెట్రలు ధర రు. 6.82 పైసలు పెరిగితే, డీజిల్ ధర రు. 7.24పైసలకు చేరుకుంది ఈ రోజు.  ఆదివారం నాడు  పెట్రోలు ధర  29 పైసలు, డీజిల్ ధర 28పైసలు పెరిగింది.  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పెట్రోలు డీజిల్ ధరలు కసితీరా పెరుగుతున్నాయి. ఆదివారం నాడు పెరిగిన దరలో రాజస్థాన్ లోని గంగానగర్ లో లీటర్ పెట్రోల్ ధర రు.108.37 పైసలుకు చేరింది. అక్కడ డిజిల్ ధర  కూడా నూరు దాటింది. ఆదివారం నాటి డీజిల్ ధర రు. 101.12పైసలు. దేశంలో ఇదే అథ్యదిక ధర.

మొత్తంగా ముంబై, రత్నగిరి, పర్బణి, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, బన్స్ వారా,  ఇండోర్, బోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, చిక్మమగళూరు, శివమోగ్గ, హైదరాబాద్, లే పట్టాణాలలో పెట్రోల్ డీజిల్ దరలు నూరు దాటి 150 వైపు పరుగుతీస్తున్నాయి.

ఢిల్లీలో   లీటర్ పెట్రోలు ధర రు. 97.22 పైసలు. డీజిల్ ధర రు. 87.97పైసలు.

ఇంతవరకు లీటర్ పెట్రోల్ ధర రు. 103. 36 పైసలు, డీజిల్ ధర రు. 95.44 పై. లతో ముంబాయి లోనే అత్యధిక ధర పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *