ప్రపంచంలో ఇంతగా వైరలైన ఫోటో మరొకటి లేదు, ఈ ఫోటో గురించి తెలుసా?

జూన్ 14, చే గెవారా  జయంతి

 మంత్రశక్తి ఏమిటో… వశీకరణ విద్య అంటే ఏమిటో ఎవరికి తెలియదు. అయితే, ఈ ఫోటోకేదో మానవాతీత మంత్రశక్తి ఉండాలి. తన వైపు చూసిన ప్రతి యువకుడిని   తనవైపు తిప్పుకునే వశీకరణ శక్తేదో ఉండి తీరాలి. లేకపోతే, ఈ ఫోటో  గురించి ఇలా రాసేందుకు వీలుకాదు.
ఈ ఫోటో స్కూటర్ల మీద, కార్ల మీద, లారీలమీద, గోడల మీద, టీషర్టుల మీద,మ్యూజిక్ అల్బమ్ ల మీద  కనిపిస్తూ ఉంటుంది. అంతేనా, చాదు,  రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల మీద,  క్యాలెండర్ల మీద, నోటు పుస్తకాల మీద, టీ మగ్ ల మీద, వైన్ గ్లాస్ ల విద్యార్థి ఉద్యమాల బ్యానర్ల మీద, బ్యారికేడ్ల మీద  పాప్ మ్యూజిక్ క్యాసెట్ల, సిడి కవర్ల మీద, సిగార్ బాక్స్  ల మీద, చివరకు  కండోమ్ల మీద … కనిపించేది.చివరకు Swept Away మూవీ దివాళ తీశాక మడోనా రిలీజ్ చేసిన  అమెరికన్ లైఫ్ అల్బ మ్  కవర్ ఫోటో కూడా మార్పింగ్ చేసిన  చే ఫోటోయే  కనిపిస్తుంది.
ప్రపంచంలో ఇంత ప్రజాదరణ ఉన్న ఫోటో మరొకటి లేదు.చివరకు మోనాలిసా, మారిలైన్ మోన్రో లు కూడా వెనకబడిపోయారు. ఎపుడో రెండు మూడు దశాబ్దాల కిందట,  ‘వైరలయింది’ అనే మాట ఇంకా డిక్షనరీలోలోకి ఎక్కని రోజుల్లో తెగ వైరలయిన ఫోటో ఇంది.
ప్రపంచం ఇంకా  నత్త నడకన నడుస్తున్నరోజుల్లో,  పోస్టు కార్డుల యుగంలో, జిరాక్స్ మిషన్లు నగరాలలో పట్టణాలలో తప్పమరొక చోట కనిపించని యుగంలో, యూట్యూబ్ , ఫైస్ బుక్, ట్విటర్ల్, పింటరెస్టు,చాట్ షేర్, ఇమెయిల్ వంటివి  కలలో కూడా కనిపించని యుగంలో ఈ ఫోటో వైరలయ్యింది.
టీషర్టు వేసుకునే ప్రతియువకుడి ఛాతీ మీదో, వెన్నుమీద నిలబడిన ఫోటో ఇది. ప్రపచంలో అత్యధిక సంఖ్యలో పునర్ముద్రించిన ఫోటో ఇది. ఇప్పటి సోషల్ మీడియా ఏజ్ భాషలో చెబితే,  ‘మోస్టు  రిప్రోడ్యూస్డ్’, ‘షేర్ డ్’  ఫోటో ఇది.
ఈ యన పూర్తి పేరు తెలియకపోయినా, ఆయన ఆదర్శం అర్థం కాకపోయినా, ఆయన పుట్టినవూరు, చచ్చిన చోటు తెలియకపోయినా, ఆయన పేరెలా పలకాలో తెలియకపోయినా, యువకుడనే వాడు ప్రపచంలో ఏమూల ఉన్నా ఈ ఫోటో ను చూసి ఉంటాడు.
ఇలాంటి ఆరాధన హోదా (cult status) తెచ్చుకున్న ఫోటో మరొకటి ప్రపంచంలో లేదు.ఇక ముందు అలాంటి ఫోటో రాదు. అలాంటి వ్యక్తి పుట్టడు. ఎందుకంటే ఆపరిస్థితులు లేవు. మళ్లీ రావు. కాబట్టి ప్రపంచంలో ఇలాంటి పోటో ఇదొక్కటే ఉంటుంది.
కులం, మతం, దేశం, జాతీయత అనే తేడాలేకుండా మనిషిలో ఏ మూలనో నక్కి నక్కి కూలబడి, ఎపుడో ఒక సారైనా మెరుపులాగ మెరిసే రెబెలియన్ నేచర్ (తిరుగుబాటుతత్వానికి)కి, స్వేచ్ఛా కాంక్షకు, సాతంతంత్య్రపిపాసకు ఈ ఫోటో ప్రతీక.
 లింగ వ్యత్యాసం లేకుండా ప్రతివారు ఎపుడో ఒక సారి రెబెల్ గా  మారి తీరాల్సిందే. అది ఇంట్లో కావచ్చు, బజారున కావచ్చు. లేదా అర్థమూ పర్థమూ లేని భావాజాలానికి, పనికి మాలిన పెత్తనానికి, నియంతృానికి, అణచేసే అధికారానికి, అలుముకున్న అవినీతికి వ్యతిరేకంగా మనుసులో నైనా ఏదో ఒక సారి, ఒక క్షణమయినా రెబెల్ కావచ్చు. ఈ ఆగ్రహం హాఫ్ లైఫ్ క్షణమేయినా సరే రెబెలే.
అందుకే ఈ ఫోటో రెబెలైన ప్రతి మనిషికి నచ్చింది.నచ్చుతుంది కూడా.
కొత్తభావాలతో రాజకీయ పార్టీలు పెడుతున్నవారికీ, ఈఫోటోలొ నుంచి పెల్లుబుకుతన్న రెబెలియన్ స్ఫూర్తి నిస్తుంది. కొొందరు ఈయనలో తిరుగుబాటుదారుని చూస్తారు. తిరుగుబాటు చేసి మనవాళి మంచి కోరాడు కాబట్టి మరికొందరు ఆయనలో మహర్షిని చూస్తారు. సెయింట్ చే (St Che) గా పూజిస్తారు.
 జీవితకాలమంతా ఆయన  క్యాపిటలిజాన్ని ఎదిరించిది, దోపిడీ లేని సమాజం స్థాపించాలనుకున్నది సాయుధంగా మాత్రమే.
తమాషా ఏంటంటే, ఇపుడాయన శాంతియుత పోరాటానికి ప్రతీకతగా నిలబడ్డారు. ఇక్కడ ప్రపంచం ఆయన్నుంచి తీసుకున్న సందేశం ఆయుధంగా కాకపోతే నిరాయుధంగానా నైనా అన్యాయాన్ని ‘ప్రశ్నించు’ అనే. అందుకే ఈకాలపు శాంతియుత పోరాటానికి కూడా ఆయన ప్రేరణ అయ్యారు.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి 
ఈయన పేరు చే గెవారా (Che Guevara (జూన్ 14, 1928 రోసారియో అర్జెంటీనా – అక్టోబర్ 9, 1967 లా హిగేరా, బొలివియా) పలకాల్సింది che gay-vara. ఈ స్పానిష్ పేరెలా పలకాలో యూట్యూబ్ లో వినండి . ఆయన పూర్తి పేరు Ernesto Guevaraa  de la Serna. ఆయన పుట్టింది ఈ నెల్లోనే (జూన్ 14న), జీవితం కాలంలో క్యూబన్ విప్లవ వీరుడయ్యారు. అక్కడి ప్రభుత్వం లో మంత్రి కూడా అయ్యారు. చదవింది వైద్యం. చేసింది విప్లవం. అమెరికా సాయంతో బొలీవియా సైన్యం ఆయనను పట్టకుంది. 1967 అక్టోబర్ 9న చంపేశారు. 1997లో ఆయన అస్తికలను బొలీవియా ప్రభుత్వం క్యూబాకు సమర్పించింది.
ఈ ఫోటో తీసిన వ్యక్తి 
ఆయనకు అమరత్వం అందించిన ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఆల్ బెయిర్తో కోర్డా (Alberto Korda)ఆయన పూర్తి పేరు Alberto Díaz Gutiérrez. క్యూబాఫోటో గ్రాఫర్.
Alberto Korda (credits: arthistoryarchive.com)
ఒక రైల్వేకార్మికుడి కుమారుడు. యువకుడిగా ఉన్నపుడు ఇది అదీ అనకుండా లెక్కలేనన్ని చిన్న చిన్న పనులు చేశాడు. అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ దగ్గిర అసిస్టెంటుగా కుదిరాడు. కుదురుగా నిలబడ్డాడు. తర్వాత చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అయ్యాడు. అది ఫోటగ్ర ఫీ ప్రపంచానికి బాగా తెలుసు. ఆయన మాంచి రసికుడు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ  అంతు చూసినవాడు. నిజానికి ఆయన ఫోటోగ్రాఫర్ జీవితం ప్రారంభమయింది అడ్వర్టయిజ్ మెంట్లకు పోటోలు తీయడంతోనే.
ఇలా మెల్లిగా హవానా వీక్లిలో రెగ్యులర్ ఉద్యోగంలో చేరాడు. క్యూబా మొట్టమొదటి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయ్యారు. ఆయనకు 1959లో Palma de Plata అవార్డు కూడా లభించింది.
అందమయిన మోడల్స్ ఫోటోలు తీస్తూ తీస్తూ ఒక అమ్మాయి అందాలను కెమెరాలోంచి చూపించి పిచ్చెక్కించాడు.
దాంతో నటేలియా మెండెజ్ ఆయన వలపులో పడిపోయింది.  తర్వాత పెళ్లాడింది. క్యూబా రెవల్యూషన్ మొదలయినపుడు ‘రెవల్యూషన్’ అనే ప్రతిక వచ్చింది. ఈ ‘రెవల్యూషన్’ తో ప్రేరణ చెందాడు. రెవల్యూషన్ కోసం పనిచేయాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. 1959 లో ఫిడెల్ క్యాస్ట్రో అమెరికా వెళ్లినపుడు ఫోటోగ్రాఫర్ గా వెళ్లాడు. అపుడాయన తీసిన ఫోటోలుకు ఎంతపేరొచ్చిందంటే అప్పటినుంచి క్యాస్ట్రో ఎక్కడివెళ్లినా కోర్డాయే ఫోటోగ్రాఫర్ .
చే ఫోటో ఎలా వెలుగులోకి వచ్చిందంటే…
1964 మార్చి 4 ఒక ఫ్రెంచి సరుకుల రవాణ నౌక La Coubre హవానా రేవులో అన్ లోడ్ చేస్తున్నపుడు పేలిపోయింది. దీని వెనక  అమెరికా సిఐఎ  హస్తముందని చెబుతారు.  బెల్జియంలో తయారయిన గ్రనేడ్లు, రైఫిల్స్ ని క్యూాబాకు తెచ్చిన నౌక ఇది.
క్యూబాకు బెల్జియం ఆయుధాలు రావడం ఇష్టంలేని  అమెరికా సిఐఎ కుట్ర జరిపి దీనిని పేల్చేసిందని క్యాస్ట్రో విమర్శ.
ఈ పేలుడులో  సుమారు వందమంది పైగా చనిపోయారు. మరుసటి రోజు  వారి సంతాప సభ జరిగింది.దీనికి పిడెల్ క్యాస్ట్రో హాజరయ్యారు. అక్కడ ఫోటోలు తీసేందుకు కోర్డా స్టేజ్ మీద ఉన్నపుడు ‘చే’ కనిపించాడు. చే ముఖ కవళిక ఆయన తెగ నచ్చింది.టకీ మని రెండు పోటోలు కొట్టేసి వెళ్లిపోయాడు.
తాను సభ  మీద తాను తీసిన ఫోటోలన్నింటిని ఎడిటర్ ముందుపెట్టారు. ఆయన కొన్ని ఎంపిక చేసుకున్నారు. అందులో చే ఫోటో లేదు. రిజెక్టయిందన్న మాట.   దీనితో ఆవి రెండు కోర్డా సొంత కలెక్షన్   లో ఉండిపోయాయి.
తర్వాత మూడేళ్లకకు 1967 లో ఒక రోజు పొద్దునే ఎవరో వ్యక్తి కోర్డా ఇంటి తలుపుతట్టాడు. తీరా చూస్తే ఆయన ఇటలీ పబ్లిషర్ గియాన్ ఫ్రాంకో ఫెల్ట్రినెల్లి(Gianfranco Feltrinelli). ఆయనకు మాంచి  చే  ఫోటోలు కావాలి. వెదుకుతున్నాడు. కోర్డా దగ్గిర కచ్చితంగా ఉంటాయనుకున్నాడు. ఉన్నాయి. ఆ రెండు ఫోటోలను తీసుకుని వెళ్లిపోయాడు.
ఆయేడాది అక్టోబర్ లో చేని అమెరికా గూఢచారులు,బొలీవియా ఆర్మీ కలసి చంపేశాయి. అపుడు  ఫెల్ట్రినెల్లి ఒక ఫోటోని పోస్టర్లు అచ్చేసి పంచాడు. అది సూపర్ హిట్టయ్యింది.  ప్రపంచంలో మోస్టు పాపులర్ ఫోటో అయింది. ఈ పాపులారిటీకి కోర్డా రాయల్టీ తీసుకోలేదు. ఎందుకంటే… “This photograph is not the product of knowledge or technique.It was really coincidence, pure luck” అని కోర్డా అభిప్రాయపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *