సూర్యాపేట్ నకిలీ విత్తనాల తెలంగాణ కొత్త జంక్షన్

 

తెలంగాణ రాష్ట్రం దేశానికేకాదు, ప్రపంచానికి  సీడ్ క్యాపిటల్ (విత్తన రాజధాని)అవుతుందని   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చనప్పటి నుంచి  ముఖ్యమంత్రి కెసిఆర్ మొదలుకుని  మంత్రులు, ఎమ్మెల్యేల దాకా చెబుతూనే ఉన్నారు. అదేమయిందో కాని,  రోజూ పోలీసులు పట్టుకంటున్న నకిలీ విత్తనాలను బట్టి చూస్తే  తెలంగాన నకిలీ విత్తన రాజధాని అయినట్లు అనిపిస్తుంది.  పేపర్లలో నకిలీ విత్తానాలు పట్టబడినట్లు వార్తలు లేని రోజు ఉండదు. ఇపుడు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి కొత్త స్లోగన్  ఇచ్చారు. నకిలీ విత్తనాల ఏరివేతకోసం మని ఆయన  నిన్న వ్యవసాయశాఖ,  పోలీసు అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ‘నకిలీ విత్తనాలు  లేని రాష్ట్రం’ గా తెలంగాణను మార్చ్చాలని పిలుపునిచ్చారు.

గత 20 రోజులలో  సైబరాబాద్ పోలీసులు 8000 కేజీల నకిలీ విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. ఎనిమిది కేసులను బుక్ చేశారు. 10 మందిని అరెస్టు చేశారు.ఇందులో 4405 కేజీల పత్తి విత్తనాలు, 4000 కేజీల గడువు మీరి మొక్కజొన్న విత్తులున్నాయి. జూన్ 9వ తేదీన  సూర్యాపేట పోలీసులు రు. 70 లక్షల విలువయిన నకిలీ బిటికాటన్ విత్తనాలు (BT3) స్వాదీనం చేసుకున్నారు.

గత ఏడాది జూన్ లో నల్గొండ పోలీసులు  నకిలీవిత్తనా అంతర్రాష్ట్ర కుంభకోణాన్ని బట్టబయలు చేశారు.  నేరస్థుల నుంచి  15 క్వింటాళ్ల నకిలీ కాటన్ విత్తనాలు స్వాదీనం చేసుకున్నారు.23 మంది అరెస్టు చేశారు. ఇలాంటి వార్తలు ప్రతి రోజువస్తున్నాయి. అంటే తెలంగాణలో నకిలీ విత్తనాలు ఎంత విసృతంగా సప్లై అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

ఇలాగే రాచకొండ పోలీసులు నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు. తాజాగా జరిపిన దాడిలో వారు రు.1.15 కోట్ల విలువయిన నకిలీవిత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. గరినేని వేణుగోపాల్ అనే వ్యక్తి నడపుతున్న ఒక గోడౌన్ మీద ఎల్ బినగర్ ప్రత్యేక పోలీసులు దాడి చేసి ఈ నకిలీ విత్తనాలు పట్టుకున్నారు.

నకిలీ విత్తనాలు విత్తినా మొలకెత్తవు. దీనితో రైతు పంట లేక ఆర్థికంగా  పతనమయిపోతాడు. ఇది రైతుల మీద వ్యాపారస్థులు జరిపే అమానుషమయిన దాడి. ఇలా నకిలీ విత్తన వ్యాపారుల మోసానికి బలై, పంటలేక, ఆర్థికచితికిపోయి  2018 జనవరిలో  విజయవాడ లో ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.

హైదరాబాద్ లో విచ్చలవిడిగా నకిలీ విత్తనాల వ్యాపారం సాగుతూ ఉందని మీడియా రాస్తూ ఉంది.

చిత్రమేమింటే, సూర్యాపేట ఈ నకిలీ విత్తనాల రాజధాని అయిపోయింది.

గతంలో ఇలాంటి పేరు ఖమ్మం జిల్లాకు ఉండింది. ఖమ్మం జిల్లా రాష్ట్రంలోని మిర్చిపంట బెల్ట్ లో ఉంటుంది. జిల్లాలోని గుడి మల్ల లో నకిలీ విత్తనాలు ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీని పట్టుకోవడంతో, ఈ జిల్లా అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాలు నెట్ వర్క్  కేంద్రంగా ఉండింది.

సూర్యాపేట జిల్లా ఈ నకిలీ విత్తన వ్యాపారానికి కొత్త ట్రాన్సిట్ హబ్ అయిపోందని పోలీసులే అంగీకరిస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ రాసింది.

సూర్యపేట జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యఉండటంతో, చక్కటి రోడ్ కనెక్టివిటీ ఉండటంతో  జిల్లా నకిలీ విత్తనాల వ్యాపారానికి కేంద్రమారింది. సూర్యపేట నుంచి తెలంగాణలోని వరంగల్ ఖమ్మం , నల్లొండ జిల్లాలలో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు మంచి  రోడ్ల కనెక్షన్ ఉంది. జిల్లా గుండా నేషనల్ హైవే  65 వెళ్లుతుంది. ఈ హైవే మీద వెళ్లే ప్రతి వాహనాన్ని నిలిపి చెక్ చేసేంత మంది మార్బలం పోలీసు, వ్యవసాయశాఖలకు ఉండవు. దీనితో తెలంగాణ నుంచి ఆంధాకు, ఆంధ్రా నుంచి తెలంగాణకు నకిలీ విత్తనాలను స్మగ్లింగ్ చేసేందుకు దొంగవ్యాపారులు సూర్యాపేటను ఒక జంక్షన్ చేసుకున్నారు.

జూన్ 8న ఒక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని70లక్షల విలువయిన నకిలీ విత్తనాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ ముఠాకి ఈ విత్తనాలు తయారుచేసి  సప్తై చేసే వీరాంజనేయులు తప్పించుకున్నాడు.  అతను కర్నాటక లోని కొప్పల జిల్లాలో కుస్తాగిలో 13 ఎకరాల్లో  నకిలీ బిటి కాటన్ విత్తనాలు పండిస్తాడు. ఈ విత్తనాలను ఒక మిల్లులో కెమికల్ ట్రీట్ మెంట్ చేసి, చక్కగా ప్యాక్ చేసి తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్ లలో అమాయక రైతులకు విక్రయిస్తుంటాడు. మరొక సారి నకిలీ చిల్లీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట పోలీసులే ఆరుగురి అరెస్టు చేసి వారివద్దనుంచి 350 కేజీల విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన ముద్దాయి అయిన వెంకటేశ్వర రెడ్డి మహారాష్ట్ర, కర్నాటకల నుంచి నకిలీవిత్తానాలు తెప్పించి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు సరఫరా చేస్తుంటాడు. కేవలం సూర్యపేటలో విక్రయించేందుకు మాత్రమే ఈనకిలీ విత్తనాలను తీసుకురావడం లేదు. నకిలీ విత్తనాలను ఇతర ప్రాంతాలకు పంపించేందుకు రవాణ కేంద్రం (Transit hub)గా సూర్యపేట ని వాడుకుంటున్నారని పోలీసులు  చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *