బిల్ గేట్స్ ఏమేమి పంటాలు పండిస్తారో తెలుసా?
బిల్ గేట్స్ అంటే స్టాఫ్ వేర్ అనుకుంటారు. బిల్స్ గేల్స్ అంటే గుర్తొచ్చేది మైక్రోసాఫ్ట్. బిల్ గేట్స్ సాఫ్ట్ వేర్ సంపన్నుడే కాదు, ఆయన పెద్ద భూస్వామి కూడా. ఆమెరికాలోనే కాదు, ప్రపంచంలోని పెద్ద భూస్వాముల జాబితా తయారు చేస్తే అందులో టాప్ లో ఉండే పేర్లలో బిల్ గేట్స్ ఒకటయినా ఆశ్చర్య పోనవసరం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లాగే బిల్ గేట్స్ కు కూడా సేద్యమంటే చాలా ఇష్టం. అందుకే ఆయన వ్యవసాయం మీద బాగా దృష్టి పెట్టారు. భవిష్యత్తు లో ఆహారం ఎలా ఉంటుందని ముందే వూహించి వాటిచుట్టూ ఆయన పెట్టుబడులు పెడుతుంటారు.
బిల్ గేట్స్ పెద్ద రైతు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన పండించే కూరగాయాలు అమెరికాలో ప్రతి ఇంట్లో ప్రత్యక్ష మవుతుంటాయంటే వింతగా ఉంటుంది. మెక్ డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలుగడ్డలు సరఫరా అయ్యేది బిల్ గేట్స్ ఫామ్ నుంచే. అమెరికన్లు వాడే ఉల్లిగడ్డలన్నీ బిల్ గేట్స్ పొలాలనుంచే వస్తాయి. అంతేకాదు, ప్రపంచంలో అత్యధికంగా క్యారట్స్ పండించే మోతుబరి బిల్ గేట్సే. ఒక విధంగా ఆయన అమెరికా అన్నదాత.
బిలిగేట్స్, ఆయన మాజీ భార్య మెలిండా వ్యవసాయంలో బాగా ఇన్వెస్టు చేశారు. వాళ్లిద్దరికి కలసి అమెరికాలోని 18 రాష్ట్రాలలలో 2,69,000 ఎకరాల భూమి ఉంది. ఇది న్యూయార్క్ సిటి విస్తీర్ణం కంటే ఎక్కువ. వాష్టింగ్టన్ కీర్క్ ల్యాండ్ లోని కాస్కేడ్ ఇన్వెస్ట్ మెంట్స్ తరఫున బిల్ రైతు దంపతులు ఈ భూములుకొన్నారు.
ఎన్ బిసి న్యూస్ సేకరించిన వివరాల ప్రకారం అమెరికా లూయిషియానాలో వాళ్లకు 70 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో సోయా, మొక్కజొన్న, పత్తి, వరి పండిస్తారు. నెబ్రాస్కాలో మరొక 20 వేల ఎకరాలున్నాయి. జార్జియాలో ఈ మధ్యనే మరొక ఆరువేల ఎకరాలు కొని వెంటనే అమ్మేశారు. బిల్ గేట్స్ కి వాషింగ్టన్ 14 వేల ఎకరాల పొటాటో పామ్ ఉంది. ఇది ఎంత పెద్దదంటే, ఈ వ్యవసాయ క్షేత్రం అంతరిక్షంనుంచి కూడాస్పష్టంగా కనిపిస్తుదని ఎన్ బి సి న్యూస్ (NBC News) రాసింది. ఇక్కడ పండే మొత్తం ఆలుగడ్డలను మెక్ డొనాల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం సరఫరా చేస్తారు. ఫ్లారిడా పామ్ లో క్యారట్లు పండిస్తారు. బిల్స్ గేట్స్ వ్యవసాయంలో భారీగా ఇన్వెస్ట్ చేసిన మోన్ శాంటోలో లో, ట్రాక్టర్లు తయారుచేసే జాన్ డీయో (John Deere)లో ఉన్న పెట్టుబడులు కాకుండా ఈ భూములను కొనుగోలు చేశారు.
అమెరికాలో రైతులు కాని ఇన్వెస్టర్ల చేతిలోకి వ్యవసాయం వెళ్లిపోయింది. ఇలాంటి ఇన్వెస్టర్లు చేతిలో అమెరికాలో మొత్తంగా 28.3 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో బిల్ గేట్స్ ఒకరు. అనేక షెల్ కంపెనీల ద్వారా బిల్స్ గేట్స్ ఈ భూములను కొనుగోలుచేశారు. 2013 నుంచి గేట్స్ దంపతులు భూములు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఈ భూములు కొన్న కంపెనీల గురించి అర్థంచేసుకోవడం చాలా కష్టం. కంపెనీలు పెట్టి, భూముల కొనేసి, కంపెనీలను మూసేసి, భూములను వేరే కంపెనీలకు బదిలీ చేసి,ఈ కంపెనీలను మెర్జ్ చేసి, మరొక కంపెనీ చేత వాటిని ఎక్వైర్ చేయించి, ఆ కంపెనీల పేర్లు మార్చి…. ఇలా అంతుండందు. వ్యవసాయంలో బిల్ గేట్స్ చేసిన ఇన్వెస్టు మెంట్లను అర్థం చేసుకోవడం నరమానవులకు సాధ్యం కాదని ‘ఎన్ బిసి న్యూస్’ రాసింది.
2018లో వాషింగ్టన్, ఆరేగాన్ మధ్య ప్రవహించే కొలంబియా నదీ తీరంలో 14,500 ఎకరాల వ్యవసాయ క్షేత్రం 2018లో 171 మిలియన్ డాలర్లకు కొన్నారు. మెక్ డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కు అలూ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది.
భవిష్యత్తులో ఆహారం స్వరూపం పూర్తిగా మారిపోంతుందని పసిగట్టి బిల్ గేట్స్ దంపతులు జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ లోనే కాదు, సింధెటిక్ మాంసం తయారీ కంపెనీలలో కూడా ఎప్పటినుంచో ఇన్వెస్టు చేయడం మొదలుపెట్టారు.
2010లోనే బిల్ గేట్స్ దంపతులు 23 మిలియన్ డాలర్లను మెన్శాంటోలో పెట్టుబడి పెట్టారు. అయితే, మోన్శాంటో జన్యుమార్పిడి ద్వారా విత్తనాలను సృష్టిస్తూ ప్రకృతి విచ్ఛిన్నానికి పాల్పడుతూ ఉందని విమర్శలు రాగానే ఆ కంపెనీనుంచి ఈ వాటాలను అమ్మేశారు. ఇక ఫేక్ మీట్ (కృత్రిమ మాంసం) కు సంబంధించి బిల్ గేట్స్ ఇంపాజిబుల్ ఫుడ్స్, బియాండ్ మీట్ లలో ఇన్వెస్టు చేశారు. బిల్ గేట్స్, మెలిండా విడాకులు తీసుకోవలసి వచ్చినపుడు జాన్ డీయో కంపెనీ షేర్లను భార్యకు బదిలీ చేశారు.
అయితే, ఎంత డబ్బున్నా, బిల్ గేట్స్ దంపతులు పర్యావరణ పరిరక్షణ మీద తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదని వారి పొలాల పక్కనున్న రైతులు చెబుతున్నారని ఎన్ బిసి న్యూస్ రాసింది.