పశ్చిమబెంగాల్ చేదు అనుభవం భారతీయ జనతా పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. బెంగాల్ ఎదురయినంత పరాభవం మరే రాష్ట్రంలో బిజెపికి గాని, ప్రధాని మోదీకి గాని, ఆయన కుడి భుజం అమిత్ షాకు గాని ఎదురు కాలేదు. ఇంత మొత్తం భారతదేశాన్ని వశపర్చుకున్నా మేధావులు బెంగాల్ ప్రజలను అర్థం చేసుకోలేకపోయారు.రాజకీయాల్లో ఏదో ఒక రోజు ఘోర పరాజయం తప్పదని ప.బెంగాల్ రుజువు చేస్తున్నది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలవవడం ఒక ఎత్తయితే, ఎంతో కష్టపడి, పదవుల ఆశ చూపి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి రప్పించుకున్నవాళ్ళంతా వెనక్కు పోయేందుకు సిద్ధమవుతుండటం మరొక ఎత్తు. ఈరోజు ముకుల్ రాయ్ ఏకంగా తృణమూల్ కార్యాలయానికి వెళ్లారు.బిజెపి ఫిరాయింపుల వ్యూహం ఇంత ఘోరంగా ఫెయిల్ అవుతుందని మోదీగాని, అమిత్ షా గాని వూహించి ఉండరు. ఎందుకంటే పార్టీ ఓడినా, ఫిరాయించిన వాళ్లయిన మిగుల్తుంటారు. బెంగాల్ లో పదవులుకు రాజీనామా చేసి బిజెపిని వదిలి తృణమూల్ పార్టీలోకి వెళ్తున్నారు.
ఒకప్పుడు ముకుల్ రాయ్ తృణమూల్ లో మమతా బెనర్జీ తర్వాత అంత పలుకుబడి ఉన్ననేత. ఆయనను బిజెపికి లోకి లాక్కున్నారు. ఏకంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడిని చేశారు. ముకుల్ రాయ్ వస్తే బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పని అయిపోతుందనుకున్నారేమే, ఆయనకు బిజెపిలో అంత పెద్ద పదవి కట్టబెట్టారు. ఆయనకు ఏమి ఆశచూపెట్టారో ఏమో గాని, గౌరవప్రదమయిన హోదా వదలుకుని ఆయన బిజెపిలోకి జంప్ చేశారు. ఇపుడేమయింది, పట్టమని రెన్నెళ్లు కాలేదు, తృణమూల్ నుంచి దిగుమతిచేసుకున్నంతా సరుకుంతా మళ్లీ తృణమూల్ కే పోతూ ఉంది. ముకుల్ రాయ్ 2017 లో తృణమూల్ వదిలపెట్టి బిజెపిలో చేరాడు. శారదా స్కామ్ వెలికిరావడంతో 2014లో ఆయనకు మమతా బెనర్జీకి సంబంధాలు బెడిశాయి. అంతవరకు తృణమూల్ ను దాదాపు ఆయనే నడిపారు.
ఆయన చాలా మంచివాడు. ప్రతిఫలం ఆశించకుండా పార్టీకోసంపనిచేశాడు. తృణమూల్ వెళ్లిపోయాక కూడా ఆయన పార్టీని పల్లెత్తు మాట అనలేదని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి.ఆయన తన రాజ్యసభకు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఇపుడాయన క్రిష్ణ నగర్ బిజెపి ఎమ్మెల్యే. అయితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన తృణమూల్ లో చేరతాడని అంతా భావిస్తున్నారు. ఇపుడు రెండు రాజ్యసభ స్థానాలు బెంగాల్ నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒకరు బిజెపికి వెళ్లినందున ఖాళీఅయింది.మరొకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి క్యాబినెట్ మంత్రి అయ్యారు. ముకుల్ ఇందులో ఒక సీటు ఆఫర్ చేస్తారని అంతా అనుకుంటున్నారు.
బిజెపికి పైకి కనిపిస్తున్నంతటి సుఖమయిన పార్టీ కాదని, అక్కడ తనకు ఉపిరాడని పరిస్థితి సృష్టించారని ఆయన అంటున్నట్లు తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి.
బెంగాల్ ప్రజల నాడి మమతా బెనర్జీకి తెలిసినంత మరొకరెవరికీ తెలియదని ముకుల్ రాయ్ ఇపుడు మమతను ప్రశంసిస్తున్నారు.
రాయ్ మెల్లిగా బిజెపికి దూరంగా జరుగుతున్నారు. కలకత్తాలో జరిగిన ఒకకీలకమయిన బిజెపి సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. మమతా బెనర్జీ పార్టీకి ఇచ్చి మెజారిటీ చూసి, ఇక్కడ బిజెపికి నూకల్లేవని తృణమూల్ పార్టీ వదిలేసి బిజెపిలోకి వెళ్లినవాళ్లంతా అనుకుంటున్నారు.
ముకుల్ రాయ్ మా కుమారుడు. ఆయన సొంత ఇంటికి వచ్చారని మమతా విలేకరుల సమావేశంలో వ్యాఖ్యా నించారు.