ఆత్మస్థయిర్యాన్ని కొల్లగొడతున్నకోవిడ్… విశాఖ, కృష్ణాల్లో ఆత్మహత్యలు ఎక్కువ

కోవిడ్ కొత్త సమస్య తీసుకువస్తూ ఉంది. చాలా మంది కోవిడ్ ఆత్మస్థయిర్యాన్ని పోగొడుతూ ఉంది.  కోలుకుంటామనే ధైర్యం  కొందరిలో రావడంలేదు. సోషల్ మీడియాలో వస్తున్న చావు వార్తలు,ఖరీదైన ప్రయివేటు వైద్యం,  ప్రభుత్వా ఆసుపత్రులలో వైద్యం కొరత, ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత తో మనకిక మంచివైద్యం  దొరకదు, ఆర్థికంగా చితికిపోతాం, అపుడు చావుకుంటే బతకు దుర్భరమవుతుందని,  తప్పదని ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తున్నది.

కోవిడ్ గురించి పాజిటివ్ సమచారం తక్కువగా ప్రజలకు అందుతూ ఉంది. కోవిడ్ నెగటివ్ వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి,వినిపిస్తున్నాయి, షేర్ అవుతున్నాయి. చుట్టూర ఇది చాలా ఆందోళనకరమయిన  వాతావరణం కల్పిస్తూ ఉంది. అందుకే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లు  ఈ వాతావరణం సులభంగా నిరాశలో పడిపోతున్నారు. ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

నిజానికి ఈ ధోరణి ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది.  ఖరీదైన కోవిడ్ చికిత్స చేయించుకున్నా, ఆర్థికంగా చితికిపోతామన్న నిరాశ నిస్పృహ వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ లో టర్కీలో కోవిడ్ సృష్టించిన అగమ్య గోచరమయిన మానసిక పరిస్థితి నుంచి బయటపడలేక 129 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, టర్కీలోనే కాదు, ఎక్కడ కూడా ప్రభుత్వాలు కోవిడ్ ఆత్మహత్యలను సీరియస్ తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన లెక్కలను కూడా సరిగ్గా సేకరించడం లేదు.

విచిత్రంగా జపాన్ లో  ఎక్కువగా యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బిబిసి రాసింది. మహిళల్లో ఎక్కువ మంది సింగిల్స్.  కోవిడ్ వల్ల ఉపాధిపోవడంతో వీళ్లంతా ఆర్థికంగా చితికిపోయారు. దీనితో నిరాశలోపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మూడు రోజుల కిందట తెలంగాణ ఖమ్మంలో  కోవిడ్-19 సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామనే నమ్మకం లేక  వనిత అనే గిరిజన మమహిళ తన ముగ్గురు పిల్లలతో కలసి మున్నేరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్తకు కోవిడ్ రావడంతో ఆమె పిల్లలతో కలసి పుట్టినింటికి వచ్చింది.కోవిడ్, పాండెమిక్ తో ఆమెకు కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోవడంతో నిరాశతో ఆమె పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది.

ఇలా కోవిడ్ నిరాశతో ఆంధ్రప్రదేశ్ లో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కృష్ణా విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారని బిబిసి తెలుగు రాసింది.

కోవిడ్  సెకండ్ వేవ్‌లో కాలంలో ఇప్పటికి వరకు  రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 మంది వరకు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ పీవీ సుధాకర్ చెప్పారు.

సెకండ్ వేవ్ కోవిడ్ కాలం  నిజానికి మరణాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది మరణం గురించి తీవ్రంగా ఆలోచించి నిరాశకు గురవుతున్నారని, వాళ్లు కేవలం మరణాల రేటు చూస్తున్నారు తప్పకోలుకుంటున్న వారి గురించి తెలుసుకుని ధైర్యం తెచ్చుకోవడం లేదని సుధాకర్ చెప్పారు.

“కరోనా ఎంత మందికి వచ్చింది? మరణాల రేటు ఎంత? రికవరీ అవుతున్నవారి సంఖ్య ఎంత? ఇటువంటి వాటిపై ఫోకస్ పెట్టడం లేదు. ఫస్ట్ వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్‌లో మరణాలు రేటు కాస్త ఎక్కువే. అయితే పీక్ టైమ్ మాత్రమే దాదాపు 1.6 శాతానికి వెళ్లింది. ప్రస్తుతం అది ఒక శాతం కంటే తక్కువే ఉంది” అని సుధాకర్ బిబిసి-తెలుగు కు చెప్పారు.

ఈ ఆత్మహత్యల్లో ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు కూడా ఉన్నాయని ఎపి స్టేట్ కోవిడ్ నోడల్ అధికారి  శ్రీకాంత్ ఆర్జా తెలిపారు.

రాష్ట్రంలో కోవిడ్ ఆత్మహత్యల సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం లేదని ఆయన అంగీకరించారు. అయితే, ఇలాంటికోవిడ్ ఆత్మహత్యలు  30 నుంచి 35 దాకా ఉండవచ్చని ఆయన బిబిసితో అంగీకరించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *