(నారా లోకేష్, తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి)
సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ లతో పాటు కనీసం 15 రాష్ట్రాలు ఇప్పటివరకు 10, 11, 12 తరగతులకు పరీక్షలను రద్దు చేశాయి.ఆయా రాష్ట్రాలు, కేంద్రం కూడా విద్యార్థుల ఆరోగ్యానికి, జీవితాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
పరీక్షలకు ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించి విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆయా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేసింది.మన రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, మానసిక వైద్యనిపుణులతో అనేకమార్లు వరుస సమావేశాలు నిర్వహించాను.వాటి వివరాలన్నీ ప్రభుత్వం ముందుంచుతున్నాను.
కోవిడ్ భయం నీడలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షలకు పంపేందుకు మానసికంగా సిద్ధంగా లేరు
మే నెల చివరి 2 వారాలలో నమోదైన 2.3 లక్షల కేసులలో, 10% కంటే ఎక్కువ కేసులు 18 ఏళ్లలోపు వయస్సువారిలోనే నమోదయ్యాయి
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం మొండిగా పట్టుబట్టడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే.
పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.
భయాందోళనలో వున్న ఆయావర్గాల నుంచి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇంతవరకూ ఎవరి అభిప్రాయాలు స్వీకరించలేదు.80 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పుగా ప్రభుత్వం పరీక్షల నిర్వహణ నిర్ణయం పరిణమించబోతోంది.
ఇతర రాష్ట్రాల మాదిరిగా, 10, 11,12 తరగతులలోని ప్రతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ లేదా ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వవచ్చు.నీట్,జెఇఇ ఇతర ప్రవేశ పరీక్షలలో మంచి ర్యాంకు సాధించేందుకు సిద్ధమవుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కోవిడ్ టైములో నిర్వహించే పరీక్షల వల్ల మానసిక ఒత్తిడి తీవ్రం అవుతుంది.
రక్షణ, ఇతర రంగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు సకాలంలో మార్కులు విడుదల చేయాల్సి ఉంది.పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి.
విద్యాసంవత్సరం నష్టపోయేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలున్నాయి.విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షల రద్దుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను.లేఖతో పాటు పరీక్షలు రద్దు చెయ్యాలంటూ విద్యార్థులు తెలిపిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేఖతో పాటు పంపిన నారా లోకేష్.