ఆంధ్రప్రదేశ్ గత 24 గంటల్లో 8,239 కొత్త కోవిడ్ కేసులు కనిపించాయి.
రాష్ట్రం మొత్తంగా నిన్ంన 1,01,863 శాంపిల్స్ ని పరీక్షించారు.
మరణాలకు సంబంధించి కోవిడ్ వల్ల గత 24 గంటల్లో 61 మంది చనిపోయారు. చిత్తూర్ జిల్లాలో పది, ప్రకాశంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు, కృష్ణా లో నలుగురు, గుంటూరులో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరణించారు.