కోవిడ్ తో పరిస్థితులు చిన్నాభిన్నమయినందున తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. కొద్ది సేపటి కిందట ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దుచేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఫస్టియర్ పరీక్షలు తెలంగాణ ప్రభుత్వంరద్దు చేసిన సంగతి తెలిసిందే.ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు నిర్ణయిస్తారు.
సిబిఎస్ఇ బోర్డు పరీక్షలను రద్దుచేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్ణయించడంతో అనేక రాష్ట్రాలు తమ బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. తెలంగాణ నిర్ణయం దీని పర్యివసానమే.
ఇప్పటికే గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తరా ఖండ్, రాజస్థాన్, హర్యానా, గోవా, కర్నాటక, మహారాష్ట్ర, ఒదిషా రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. ఇపుడు ఇంటర్ మొత్తం పరీక్షలను రద్దు చేసి తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, బీహార్, చత్తీష్ గడ్, కేరళ రాష్ట్రాలు ఇంకా తమ నిర్ణయం ప్రకటించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయాలనే వత్తిడి తీవ్రంగా ఉంది.