వచ్చే జనవరి నాటికి విజయనగరం సమీపంలోని రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
విజయనగరం సమీపాన రామతీర్థం లోని శ్రీరాముల వారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు దర్శించారు.
ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మంత్రి రామతీర్థంలో నిర్మించనున్న ఆలయ నమూనాలను విడుదల చేశారు.
కొండపైన ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని, ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీ లను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు శాస్త్రోక్తంగా రూ. 3 కోట్ల వ్యయంతో ఆలయాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేస్తున్నామని మంత్రి వెలంపల్లి తెలిపారు.
చిలకలూరిపేట నుంచి రాతి పని వారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా రూపొందిస్తున్నామని కూడా ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సిసి కెమెరాల పర్యవేక్షణలో వుంచి దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేశామని, దేవాలయాల్లో భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని మంత్రి వెలంపల్లి చెప్పారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/where-is-ramateertham-what-is-its-history/
Like this story? Pl share it with friends