ఆనందయ్య మందు అన్ని చోట్ల తయారీకి అనుమతించండి…

ఆనందయ్య కరోనా నివారణ మందు “నెల్లూరు టు చిత్తూరు “
అన్ని నియోజకవర్గాలలో తయారీకి అనుమతి ఇవ్వండి!

(నవీన్ కుమార్ రెడ్డి)

1)చంద్రగిరి శాసనసభ్యుడు సోదరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్య రీత్యా కరోనా నివారణ మందు తయారు చేయించి ప్రతి ఇంటికి పంపిణీ కి రంగం సిద్ధం చేయడం అభినందనీయం అదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో శాసనసభ్యులు ఉచిత కరోనా నివారణ మందు పంపిణీకి ముందుకొస్తే నెల్లూరు ఆనందయ్య మందు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోతుంది,ప్రజలు సంతోషిస్తారు!

2) తిరుపతి నియోజకవర్గ ప్రజల కొరకు తన సొంత నిధులతో మా తండ్రి ఒక నాటి మునిసిపల్ ఛెర్మన్ పి.ముని రెడ్డి  గారి జ్ఞాపకార్థం ఆసక్తిగల ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆనందయ్య వినియోగించిన వనమూలికలతో కరోనా నివారణ మందు తయారుచేసి ఇచ్చే అవకాశం కల్పించండి!

3) నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా నివారణకు వాడిన వనమూలికలను తిరుపతిలో ఆయుర్వేదంలో MD చేసి అపార అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పార్థసారథి గారి పర్యవేక్షణలో యధావిధిగా వినియోగించి మందు తయారు చేసి నగరంలోని 50 డివిజన్లలో “ఆసక్తి” గల ప్రజలకు మాత్రమే అందజేస్తాను!

నవీన్ కుమార్ రెడ్డి

4) టీటీడీ వారు సహృదయంతో డి అర్ మహల్ వద్ద గల రెండవ సత్రాలలో వనమూలికల సమీకరణకు మందు తయారీకి స్థలం కేటాయించాలని టిటిడి ఈవో గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తాను!

5) తిరుపతి నగర ప్రజలతో పాటు ఆసక్తి ఉన్న టిటిడి, నగరపాలక సంస్థలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని ఉద్యోగస్తులు ఫ్రంట్ వారియర్స్ అందరికీ కూడా మందు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా స్నేహితుల,స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను !

6) నెల్లూరు జిల్లాలోని నా మిత్రుల ద్వారా కృష్ణపట్నం ఆనందయ్య శిష్య బృందం నుంచి ఇద్దరిని మందు తయారీ పర్యవేక్షకులుగా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి!

7) తిరుపతి నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతిరోజు 200 కుటుంబాలకు మందు పంపిణీ చేసేందుకు నగరపాలక సంస్థ పాఠశాలలలో వార్డు వాలంటీర్ ల సహకారంతో అనుమతించేలా కమిషనర్, మేయర్,కార్పొరేటర్ లను కలిసి విజ్ఞప్తి చేస్తాను!

8) ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వర్తక సంఘం నాయకులతో మాట్లాడి జిల్లా నలుమూలల నుంచి ఆనందయ్య మందు తయారీకి కావలసిన వనమూలికలను రైతుల నుంచి సేకరించి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాను!

9) చిత్తూరు జిల్లాలో కోవిడ్ నిబంధనలు,కర్ఫ్యూ,పోలీస్ ల ఆంక్షల కారణంగా ఆనందయ్య మందు తయారీకి వ్యక్తిగతంగా తనకు అనుమతి ఇవ్వలేని పక్షంలో టీటీడీ,ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్థలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నియోజకవర్గ శాసనసభ్యుల సహకారంతో ఆయా నియోజకవర్గ ప్రజలకు కరోనా నివారణ మందు అందించేలా చర్యలు చేపట్టాలి!
సర్వేజనా సుఖినోభవంతు

(నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ నాయకుడు, తిరుపతియాక్టివిస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *