వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి గ్రామంలో ఈటల కు మంగళహారతులతో అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు నుదుట తిలకం దిద్ది ఈటల వెంటే ‘మేము ఈటల కోసంచ జై ఈటెల జై జై ఈటెల,’ అంటూ నినాదాలు చేశారు.
Thanks for your love & affection and support. #huzurabad #kamalapur pic.twitter.com/dxUIyZLEAk
— Eatala Rajender (@Eatala_Rajender) June 8, 2021
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ ఎస్ , శాసన సభకు రాజీనామా చేయడాన్ని చాలా మంది అభినందించినా, ఆయన బిజెపిలో చేరడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయన స్వతంత్రంగా రాష్ట్రమంతా తిరిగి ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలను వెలికితీసి కెసిఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ చేయించాల్సి ఉండిందని కొంతమంది అభిప్రాయపడితే, మరికొందరు సొంత పార్టీ ఏర్పాటు చేయాల్సి ఉండందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ఇపుడు విశ్వసనీయ ప్రతిపక్ష పార్టీ జాగా ఖాళీగా ఉందని, ఇలాంటి పార్టీ ఏర్పాటుచేయగల శక్తి యుక్తులు ఈటెలకు ఉన్నాయని, ఆయన ముందుకు వస్తే, ఒక కూటమి తయారయ్యేది వారు వాదిస్తున్నారు.
వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్న ఈటెల మత తత్వ పార్టీ అయిన బిజెపి లో చేరడం చాాలా మందికి నచ్చడం లేదు.
అయితే, తాను వ్యక్తిగా , ఒక వ్యవస్థ మద్దతుఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎదుర్కొోవడం సాధ్యంకాదని, అందుకే తాను బిజెపిలో చేరాల్సివచ్చిందని రాజేందర్ వారికి సమాధానం చెప్పారు.
ఏమయినా, ఇన్ని భిన్నాభిప్రాయాల మధ్య ఈటెల ముందుకు వెళ్లాలి. తనకు ప్రజల మద్దతు ఉందని, ప్రజలు తనతో ఉన్నారని, ముందు ముందు ఉంటారని ఆయన నిరూపించుకోవాలి.
ఈ ప్రయత్నం లో భాగమే శంభునిపల్లె గ్రామంలో అభిమానుల హంగామా అని చెబుతున్నారు. కోవిడ్ లాక్ డౌన్ ఎత్తేశాక ఆయన రాష్ఱ్రమంతా పర్యటిస్తారని ఈటెల సన్నిహితులొకరు వెల్లడించారు.
ఇప్పటికే ఆయనకు అన్ని జిల్లాలనుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, కేవలం కోవిడ్ లాక్ డౌన్ దృష్ట్యా ఈటెల కొద్ది రోజులు ఓపిక పట్టి రాష్ట్ర పర్యటనకు పూనుకొవచ్చని ఆయన చెప్పారు.