స్టాక్ డేల్ ప్యారడాక్స్ అంటే అర్థం ఏమిటి?

Admiral James Stockdale (డిసెంబర్ 23, 1923- జూలై 5, 2005) అనే అమెరికన్ నౌకదళ అధికారి  –  వియత్నాం యుద్ధం లో యుద్ధఖైదీగా మరి కొందరు తోటి అమెరికన్  సైనికులతో సహా దొరికిపోయాడు.  Stockdale అమెరికన్ సైన్యంలో admiral గా పనిచేసాడు.విడుదలై వచ్చాక ఆయన చాలా పుస్తకాలు రాశారు. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేశారు.

1965 నుంచి 1973 దాకా అంటే యుద్ధం పతాక  స్థాయిలో ఉన్నపుడు  ఆయన హనోయ్ హిల్టన్ అనే యుద్ధ ఖైదీల శిబిరంలో ఉన్నాడు. ఆయన్ని వియత్నాం సైనికులు ఆ ఎనిమిదేళ్ల కాలంలో కనీసం 20 సార్లు టార్చర్ చేశారు.

ఇతనితోపాటు ఆ జైలులో ఉన్న సైనికులు ప్రతిసారి  తాము ఇదిగో ఈ   క్రిస్టమస్ కు బయటకొచ్చేస్తామని ఆశ పడేవాళ్లు. కాని కుదరలేదు.లేదు, లేదు, ఈ సారి న్యూఇయర్ కు వదిలేస్తారను కున్నారు. వదల్లేదు. ఈస్టర్ కు వదులుతారనుకుంటే, అప్పుడూ వదల్లేదు. ఇలా ప్రతీ సంవత్సరం వదిలేస్తారనుకోవడం, వాళ్లు వదలకపోవడం జరిగేది.

ఇలా ప్రతీ సంవత్సరం పెట్టుకున్నఆశ  నెరవేరకపోవడంతో నిరాశతో రెండు మూడేళ్ళల్లో ఒక్కొక్కరు చచ్చిపోవడం జరిగింది.

ఇలా తోటి వారందరూ చనిపోతున్నా , స్టాక్ డేల్  మాత్రం బ్రతికే వున్నాడు!

కారణం?

Extreme or too much hope చాలా ప్రమాదకరం. మనం అనుకున్నది జరగకపోతే నిరాశలో  పడిపోతాం. అలాకాకుండా Stockdale లాగా అంతిమంగా కథ సుఖాంతమే అవుతుందని నమ్మాడు. ఆరోజుకోసం ఎపుడు ఎదురుచూల్లేదు.

Stockdale మాత్రం ప్రతి సంవత్సరం, ప్రతిసారి తాను బయటకు వచ్చేస్తానని మాత్రం ఆశించలేదు. ఎప్పటికైనా తాను విడుదల అవుతానని మాత్రం అనుకున్నాడు. ఖచ్చితంగా తాను బయటకువెళ్ళి  తనవాళ్ళను తప్పకుండా కలవగలననే నమ్మకం పెట్టుకున్నాడు.

అంతేగాని… మిగిలినవాళ్ళలాగా అదిగో ,ఇదిగో  అని ఆశపడలేదు. అత్యాశ (extreme hope) పెట్టుకోలేదు.

కాని తనకథకు మాత్రం సుఖాంతమే ఉంటుందని మాత్రం నమ్మకం పెట్టుకున్నాడు.

ఆఖరికి ఏడు సంవత్సరాల తరువాత అతను జైలునుండి రిలీజయ్యాడు. కాని తన తోటివారు మాత్రం అప్పటికే చనిపోయారు.

ఇలా ఇతను బ్రతకడానికి తోడ్పడిన ఈ ఆలోచనా విధానాన్నేస్టాక్ డేల్ ప్యారడాక్స్ (Stockdale Paradox) అంటారు.

ఇప్పుడు ఈ thought process కరోనా విషయంలోనూ అవసరమే .

ఇప్పుడు తగ్గుతుంది, అప్పుడు తగ్గుతుందనే short term  Extreme Hopes పెట్టుకునే కన్నా. ఖచ్చితంగా మనం ఈ pandemicను దాటుకుని గతంలో లాగానే చక్కగా, సంతోషంగా తిరగ గలుగుతామనే నమ్మకాన్ని ఉంచుకుని , ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఎదురు చూడండి అని స్టాక్ డేల్ ప్యారడాక్స్ చెబుతుంది.

కరోనాకే బోర్ కొట్టి – అది మనల్ని వదలి వెళ్ళే రోజు  ఎంతో దూరం ఉండబోదని నా ఉద్ధేశం.

కథ సుఖాతమయ్యేందుకు ఎదురుచూద్దాం.

Jim Collins అనే ప్రొఫెసర్ Good to great అనే Book లో ఈ Stockdale Paradox గురించి రాసి బాగా పాపులర్ చేశారు.

 

జిమ్ కాలిన్స్ విద్యార్థి ఒకరు స్టాక్ డే ల్ మీద రీసెర్చ్ చేయాలనుకున్నారు. నిజానికి అప్పటికే స్టాక్ డేల్ హూవర్ ఇన్ స్టిట్యూట్ లో కష్టాలకు సుఖాలకు చలించని  స్థిత ప్రజ్ఞులైన తత్వవేత్తల మీద (Stoic Philosophers) మీద పరిశోధన చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల యుద్ధ ఖైదీ నరకం మీద భార్యతో కలసి స్టాక్ డేల్ In Love and War అనే పుస్తకం కూడా రాశాడు. ఈ పుస్తకాన్ని కాలిన్స్ చదివాడు. తన విద్యార్థితోకలసి కాలిన్స్ స్టాక్ డేల్ ను కలుసుకుని ఆయన కథంతా విన్నాడు. ఆ తర్వాత ఆయనకు స్టాక్ డేల్  అచంచల విశ్వాసం  వెనక ఉన్న మానసిక స్థితి అర్థమయింది. దానికే ఆయన Stockdale Paradox అనిపేరు పెట్టాడు.

“You must maintain unwavering faith that you can and will prevail in the end, regardless of the difficulties, and at the same time, have the discipline to confront the most brutal facts of your current reality, whatever they might be,  అని కాలిన్స్ దీనిని సూక్మీకరించాడు.

ఈ Stockdale Paradox Theory ని ఈ2020 ఆగస్టులో కోవిడ్ పాండెమిక్ మధ్య Harvard university, తమ Business School meeting లో కొన్ని పాఠాలుగా విడదుల చేసింది. కోవిడ్-19 సంక్షోభంలో కంపెనీల మేనేజ్ మెంట్స్ ఎదుర్కొనే విషయంలో ఈ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చేప్పేందుకు హార్వర్డ విశ్వవిద్యాలయం ఈ పాఠాలు విడుదల చేసింది. హార్వర్డ నిపుణులు బొరిస్ గ్రాస్ బెర్గ్,రాబిన్ అబ్రహామ్స్ మాటల్లో  స్టాక్ డేల్ ప్యారడాక్స్ అంటే..

“The Stockdale Paradox and survival psychology contain wisdom for how leaders can damage the coronavirus crisis”

వీలుకుదిరితే ఆ పాఠాలు, స్టాక్ డేల్ పుస్తకాలు చదవండి. Stockdale Paradox Theory ని మర్చిపోకండి. 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మన ఓపికను పరిష్కరించుకోగలిగే అవకాశం వస్తుంది. మనకి అద్భుతమైన ఓపిక ఉందనే విషయం మనకి ఇప్పటికే అర్థమైపోయింది.

ఇంకెంత కొంతకాలమే ఈ పరీక్ష! చివరిదాకా ఓపికతో ఉన్నవాడే ,  యుద్ధాన్ని గెలవగలడు.

ఇంకో విషయం-

ఇంత భయంకరమైన కరోనానే ఓపిక తో జయించగలిగినపుడు – భవిష్యత్ లో మీ జీవితంలో కి అడుగు బెట్టేవి చాలా చిన్నసమస్యలైపోతాయి. అన్నింటికన్నా పెద్దసమస్య – మరణం. దానినే మీరు ఎదుర్కోని బయటకు రాగలిగినపుడు. ఇక మిగిలిన సమస్యలన్నీ చాలా చిన్నవి. తేలికగా పరిష్కరించగలరు.

“You must never confuse with faith that you prevail in the end which you can never afford to lose- with the discipline to confront the most brutal facts of your current reality, whatever they might be.”- Admiral James Stockdale

(source:Whatsapp వైరల్ అవుతున్న పోస్టును కొద్దిగటా ఎడిట్ చేయడం జరిగింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *