“మా అమ్మ ఐసీయూలో సీరియస్ గా ఉంటే, ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్న మా కుటుంబ సభ్యులను మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టారు. నేను వీడియో కాల్ చేసినా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, డోంట్ టాక్ రబ్బిష్ అంటూ మా వాళ్లని అన్నారు. ఒక ప్రజా సేవకురాలు ఎమ్మెల్యే అయిన నాకే ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి.