రోజూ వేల సంఖ్యలో యాత్రికులు సందర్శించే తిరుపతి నగరంలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధి రోజురోజుకి ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నది. యాత్రికులకు, నగరవాసులకు కనువిందు చేసే విధంగా గరుడ వారధి స్థంభాల మీద కళంకారి వర్ణచిత్రాలు చిత్రీకరిస్తున్నారు. ఇలాగే వారధిని చూడముచ్చటైన ప్రదేశంగా మార్చేందుకు మునిసిపల్ కమిషనర్ గిరిషా ఆధ్వర్యంలో సుందరీకరణ జరుగుతూ ఉంది. ఈ పనులను ఈ రోజు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్ తో కలసి పరిశీలించారు.
వారధి నిర్మాణం బాగుందని అనేక మంది యాత్రికులు కూడా దృష్టికి తీసుకు వచ్చారని, వీటిని సకాలంలో పూర్తి చేస్తే తిరుపతి లో ట్రాఫిక్ సమస్య తీరుతుందని మరియు పనులు పూర్తయితే తిరుపతి అందంగా, ఆధ్యాత్మిక, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని అని తెలియజేశారు.
తిరుపతి లీల మహల్ కూడలి నుండి నంది కూడలి వరకు జరుగుతున్న గరుడ వారధి పనులు ఎమ్మెల్యే పరిశీలించి పనితీరు అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే కమిషనర్ గిరీషను అభినందించారు.
గరుడు వారిది పిల్లర్లుకు, ప్రజా ఆకర్షణీయంగా కలంకారి పెయింటింగ్స్, వంతెన కింద డివైడర్ మధ్యలో అందమైన పూల చెట్లు పెంచడం బాగుందని ప్రశంసిస్తూ వాటికి తగిన సంరక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమన సూచించారు.
డివైడర్ల దాటుకుని మనుషులు తిరక్కుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కమిషనర్ గిరీష ను కోరారు.
గడువులోపల గరుడ వారధి పనులు పూర్తిచేసి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ గిరీష ఎమ్మెల్యే కి తెలియజేశారు.
అనంతరం గొల్లవాని గుంట వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, గొల్లవాని గుట్ట రోడ్డు నుంచి 150 అడుగు బైపాస్ రోడ్లు అనుసంధానం చేస్తూ 60 అడుగుల రోడ్డు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరారు.
అభివృద్ధి పనులు కు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచే దానికి ప్రణాళిక సిద్ధం చేస్తే , కొంతమంది అక్రమాణలకు చేస్తున్నారని వారి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వారితోపాటు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం, కార్పొరేటర్ ఉమా, నగరపాలక సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, స్మార్ట్ సిటీ ఆప్కాన్స్ స్వామి, స్మార్ట్ సిటీ ఇంజనీర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.