ఒక వ్యక్తి రెండు రకాల వ్యాక్సిన్ లను తీసుకుంటే ఏమవుతుందనే ప్రశ్న చాలా కాలంగా ఉంది. దీనికి స్పష్టమయిన జవాబు లేదు. ఆమధ్య ఉత్తర ప్రదేశ్ లోని ఒక వూర్లో మొదటి డోస్ కోవిషీల్డ్, రెండో డోసు కోవాగ్జిన్ వేశారు. దీనితో ఇండియాలో కూడా ఈ చర్చ మొదలయింది. నష్టయితే ఉండదని నీతిఆయోగ్ సభ్యుడు వికె పాల్ చెప్పారు.అయితే, చాలా మంది అది మంచిది కాదు అని అన్నారు. వ్యాక్సిన్ వేర్వేరు పద్ధతుల్లో తయారు చేస్తారు కాబట్టి వాటిని కలపడం మంచిది కాదని వీరంటున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా ఉహాగానాలే తప్ప పరీక్షల్లో తేలింది.
ఉత్తర ప్రదేశ్ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం కూడా రెండు రకాల వ్యాక్సిన్ లను మిక్స్ చేసే విషయం పరిశీలిస్తున్నది.
ఈ లోపు అమెరికాలో ఈ పరీక్షలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి ఒక వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక, మూడో డోసు బూస్టర్ గా మరొక వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందనే దానిమీద అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ట్రయల్స్ జరుపుతున్నది. ఈ ప్రయోగానికి 150 మందిని ఎంపిక చేసుకున్నారు. అమెరికాలో ఆమోదం పొందిన మూడు వ్యాక్సిన్ లలో వీరంతా ఏదో ఒక రకం పూర్తి డోస్ లు తీసుకున్నవారు. ఆమెరికాలో ఫైజర్,జాన్సన్ అండ్ జాన్సన్, మాడెర్నా వ్యాక్సిన్ లకు అనుమతి ఉంది.ఇందులో జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోస్ వ్యాక్సిన్ . మాడెర్నా, ఫైజర్లు డబుల్ డోస్ వ్యాక్సిన్లు
ఒక వ్యాక్సిన్ పూర్తి డోస్ లు తీసుకున్నాక, మూడు నెలల తర్వాత ఇతర వ్యాక్సిన్ ఇచ్చి ఫలితాలను పరిశీలిస్తారు. ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు ఈ ట్రయల్స్ పాల్గొనేందుకు ముందుకు రావచ్చు. అంటే ఫైజర్ రెండు డోసులు తీసుకున్నాక, మూడు నాలుగు వారాల తర్వాత మాడెర్నా లేదా జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకోవచ్చు.
అయితే, ఆమెరికాశాస్త్రవేత్తలు మరొక వాదన తీసుకువస్తున్నారు. ఒకసారివ్యాక్సిన్ తీసుకున్నాక, ఇమ్యూనిటీ అనేది ఎంతకాలం ఉంటుందనేది కూడా ఇంకా తెలియడంలేదు. అమెరికాలో అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్ లు శక్తివంతమయినవే అయినా అవి ఎంతకాలం తమ ప్రభావం చూపిస్తాయనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినేష్ట్రేషన్ కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ డాక్టర్ పీటర్ మార్క్స్ మరొక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేశారు.ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ఒక ఏడాది లోపు మరొక బూస్టర్ డోస్ తీసుకొనక తప్పదని ఆయన మే 18న కోవిడ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.