ఆకాశంలోకి ఎగురబోతున్న మహబూబ్ నగర్ మనవడు

రాజా చారి ఈ పేరు గుర్తుంచుకోండి. ఇంకా బాగా చెప్పాలంటే విర్పూత్తూరు రాజా చారి.  ఈ పేరు చరిత్రలో నిలవబోతున్నది.  ఎందుకంటే అమెరికా యాస్ట్రొనట్ శిక్షణ పొంది, చంద్రుని మీదకు వెళ్లున్న యువకుల్లో రాజా చారి ఒకరు. ఏమో ఎవరు చూశారు. 2028లో అమెరికా అంగారకుడి మీద కూడా మనుషుల్ని పంపాలనుకుంటున్నది. ఆచాన్స్ కూడా భారతీయ సంతతికి చెందిన చారి కి రావచ్చు. రాజా చారి హైదరాబాదీ.

ఇపుడు ఆయన ఇంటర్నేషనల్ స్పేస్  సెంటర్ (ISS) కు వెళ్లున్న స్పేస్ ఎక్స్ -3 క్రూ (Space X 3) క్రూ కమాండర్ అయ్యారు.  ISS యాత్ర ఈ ఏడాది అక్టోబర్ లో ఉంటుంది.

రాజాచారి తండ్రి శ్రీనివాస్ చారి. హైదరాబాదీ. అమెరికా లో స్థిరపడ్డారు. 2017లో రాజా చారి  నాసా యాస్ట్రొనట్ క్యాండిడేట్ క్లాస్ కు ఎంపికయ్యారు. ఆ యేడాది ఆగస్టు నుంచి ఈ క్లాసులకు హాజరయ్యారు. 1999లో ఆయన యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఏరోనాటిక్స్ అండ్ యాస్ట్రొనాటిక్స్ పిజి చేశారు. తర్వాత యుఎస్ నేవల్   టెస్ట్ పైలట్ కోర్సుకూడా చేశారు. ఆయనకు వివాహమయింది. భార్య పేరు హాలీ స్కాఫర్ చారి. వారికి ముగ్గురు సంతానం. తల్లి పేరు పెగ్గీచారి, అయోవాలోని సెడార్ ఫాల్స్ లో నివాసముంటున్నారు. తండ్రి 2010 ఏప్రిల్ లోచనిపోయారు.

శ్రీనివాస్ చారిది మహబూబ్ నగర్. ఆయన తండ్రి అంటే రాజాచారి తాత ఉస్మానియాలో మ్యాథమేటిక్స్ ప్రొఫెసర్. అయితే, 1955లో శ్రీనివాస్ 13 సంవత్సరాల వయసపుడే ఆయన చనిపోయారు.ఆయనను తల్లే పెంచి పెద్ద చేసింది. తర్వాత శ్రీనివాస్ కూడా ఉస్మానియా నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.1970లో అమెరికా వెళ్లారు. విస్కాన్ సిన్ లో చదవుతున్నపుడు యూనివర్శిటీ కార్డియాక్ విభాగంలో నర్స్ గా ఉన్న పెగ్గీ తో పరిచయమయింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు.రాజా చారి 1977జూన్ 25 న జన్మించాడు. శ్రీనివాస్ చారికి ట్రాక్టర్లు తదితర వ్యవసాయ పరికరాలుచేసే జాన్ డీర్ (John Deere)లో ఉద్యోగం వచ్చింది.

తల్లి పెగ్గి, తండ్రి శ్రీనివాస చారితో రాజచారి (credit:Talangana Today)

హూస్టన్ లోని జాన్ హాప్కిన్స్ సెంటర్ లో కఠోర శిక్షణ తర్వాత 11 సిల్వర్ పిన్స్ అందుకున్న పదకొండు మంది  యాస్ట్రోనాట్స్ కు చారి ఎంపికయ్యాడు. నాసా సంప్రదాయం ప్రకారం సిల్వర్ పిన్స్ పొందిన వాళ్లకే ఆంతరిక్షంలోకి వెళ్లే అర్హత ఉంటుంది. ఒక సారి అంతరిక్షంలో కి వెళ్లాక ఈ సిల్వర్ పిన్స్ పోయి గోల్డెన్ పిన్స వస్తాయి.

ఇలా అంతరిక్షంలోకి ఎగిరే అవకాశం దక్కించుకున్న భారతీయ సంతతి వారిలో చారి మూడవ వ్యక్తి.  కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ మిగతా ఇద్దరు. 2024లో అమెరికా యాస్ట్రోనట్సో చంద్రుని మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2024లో ఒక పురుషుడిని, ఒక మహిళలను చంద్రుని మీదకుపంపాలని ఆమెరికా భావిస్తున్నది. ఇదే విధంగా 2028నాటికి అంగారకుడి మీదకు కూడా పంపేందుకు అసవరమయిన బేస్ ను చంద్రుని మీద తయారుచేసేందుకు 2024 చంద్రమండలయాత్ర జరుపుతున్నారు.

రాజాచారి బయో

Summary:
Raja Chari was selected by NASA to join the 2017 Astronaut Candidate Class. He reported for duty in August 2017 and is currently training for NASA SpaceX Crew-3 Mission to the ISS scheduled to launch October 2021. The Iowa native graduated from the U.S. Air Force Academy in 1999 with bachelor’s degrees in Astronautical Engineering and Engineering Science. He continued on to earn a master’s degree in Aeronautics and Astronautics from the Massachusetts Institute of Technology and graduated from the U.S. Naval Test Pilot School.

Personal Data:
Born in Milwaukee, Wisconsin, Chari was raised in Cedar Falls, Iowa. He is married to Holly Schaffter Chari, also a Cedar Falls native, and the couple has three children.

Education:
Graduated from Columbus High School in Waterloo, Iowa. Earned a bachelor’s degree in Astronautical Engineering from the U.S. Air Force Academy in Colorado. Earned a master’s degree in Aeronautics and Astronautics from the Massachusetts Institute of Technology, in Cambridge, Massachusetts. Graduated from the U.S. Naval Test Pilot School in Patuxent River, Maryland. Graduated from US Army Command and General Staff College in Fort Leavenworth, Kansas.

 

Experience:
At the time of his selection in June 2017, Chari was a Colonel select in the U.S. Air Force, serving as the Commander of the 461st Flight Test Squadron and the Director of the F-35 Integrated Test Force. He has accumulated more than 2,500 hours of flight time in the F-35, F-15, F-16, and F-18 including F-15E combat missions in Operation Iraqi Freedom and deployments in support of the Korean peninsula.

NASA Experience:
Chari reported for duty in August 2017 and completed two years of training as an Astronaut Candidate. He then served as the Director of the Joint Test Team for the NASA Commercial Crew Program. Chari is currently in training for NASA SpaceX Crew-3 mission to the International Space Station scheduled to launch October 2021.

Awards/Honors:
Awarded the Defense Meritorious Service Medal, the Meritorious Service Medal, the Aerial Achievement Medal, the Air Force Commendation Medal, the Air Force Achievement Medal, an Iraq Campaign Medal, a Korean Defense Service Medal and the Nuclear Deterrence Operations Service Medal. Named distinguished graduate from the US Air Force Academy, Undergraduate Pilot Training, and the F-15E Formal Training Unit.

(source: NASA)

One thought on “ఆకాశంలోకి ఎగురబోతున్న మహబూబ్ నగర్ మనవడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *