ఆంధ్రలో ఫుల్ గా మెడికల్ కాలేజీలు, కొత్తగా 1850 ఎంబిబిఎస్ సీట్లు

ఆంధ్రప్రదేశ్ లో  కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో  11 వైద్య కళాశాలలు, రెండు డెంటల్‌ కాలేజీలు, 10 నర్సింగ్‌ కళాశాలలు ఉన్నాయి.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల్లో ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు మొదలయ్యాయి.  సోమవారం నాడు మిగిలిన 14 టీచింగ్‌ ఆస్పత్రుల పనులను సీఎం వైఎస్  జగన్‌ ప్రారంభిస్తారు.

కొత్త మెడికల్‌ కాలేజీలు:

పాడేరు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పులివెందుల, పెనుకొండ, అదోని, నంద్యాలలో ఈకాలేజీలు ఏర్పాటువుతున్నాయి. వీటి నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తారు.  ప్రతి వైద్య కళాశాల వెంట నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు.

1850 మెడికల్ సీట్లు

వీటన్నింటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు, 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్టు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల పనులు మొదలు పెట్టినుందువల్ల, మిగిలిన 14 వైద్య కళాశాలల పనులకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ శిలా ఫలకాలు ఆవిష్కరిస్తారు.

2023 చివరి నాటికి వైద్య కళాశాలల నిర్మాణం 

– ప్రతి మెడికల్‌ కాలేజీలోనూ 500 పడకలు తగ్గకుండా ప్రత్యేక సర్వీసులతో కూడిన ఏర్పాట్లు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్‌ సర్వీసులు.
– ఐటీ సర్వీసులు, సీసీ కెమెరాలు అనుసంధానం.
– ప్రతి కాలేజీలోనూ, అనుబంధ ఆసుపత్రిలో 10 మోడ్యులర్‌ ఆపరేషన్‌ ధియేటర్లు.
– సెంట్రలైజ్డ్‌ ఏసీతో కూడిన ఐసీయూ, ఓపీడీ రూమ్స్, డాక్టర్‌ రూమ్స్‌
అన్ని పడకలకు మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్లు ఏర్పాటు.
– ఆక్సిజన్‌ స్టోరేజి ట్యాంకులతో పాటు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు.
– నర్సింగ్‌ కాలేజీ, హాస్పిటల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *