యాస్ తుపాను ఎట్టకేలకు ఉదయం 10.30కి ఒదిశా తీరం దాటింది. తఫానును దృష్టిలో పెట్టకుని ఒదిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు 14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇదేవిధంగా పొరుగున ఉన్న జార్ఖండ్ లోని సింఘ్బూమ్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ నష్టం, పెద్దగా ఆస్తి నష్టం లేకుండా నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
ఒదిశాలోని దామ్రా- దక్షిణ బాలసోర్ మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 155కి.మీ వేగంతో గాలులు వీచాయి.యాస్ వేగంగా దూసుకుపోయే తుఫాన్ కాదు. అందువల్ల తీరం తాకడం మూడు నాలుగుగంటలు కొనసాగుతుందని అధాకారులు చెబుతున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావానికి ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. ఒదిషాలోని కేంద్రపాద, జగత్సింగ్ పూర్, జైపూర్, భద్రక్, కటక్ ధెంకనాల్ మీద భీభత్సం సృష్టిస్తున్నది. ఒదిశా నుంచి ఇది ఝార్ఖండ్ వైపు కదులుతుంది
VSCS ‘YAAS’ CROSSED NORTH ODISHA COAST ABOUT 20 KM SOUTH OF BALASORE DURING 1030 TO 1130 HOURS IST OF TODAY WITH ESTIMATED WIND SPEED OF 130-140 KMPH GUSTING TO 155 KMPH.THEN MOVED NW-WARDS AND AT 1130 HRS IST,CENTRED NEAR 21.4°N/86.9°E ,ABOUT 15 KM SSW OF BALASORE. pic.twitter.com/mVfI55lg1l
— India Meteorological Department (@Indiametdept) May 26, 2021
THE VERY SEVERE CYCLONIC STORM ‘YAAS’ (PRONOUNCED AS ‘YASS’) WEAKENED INTO SEVERE CYCLONIC STORM AND LAY CENTRED AT 1230 HRS IST OF THE 26TH MAY, 2021 OVER NORTH COASTAL ODISHA NEAR LATITUDE 21.45°N AND LONGITUDE 86.8°E, ABOUT 15 KM WEST-SOUTHWEST OF BALASORE. pic.twitter.com/rDLDgu4T3p
— India Meteorological Department (@Indiametdept) May 26, 2021