తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ (Yaas) తుఫానుగా కొనసాగుతున్నది. తరువాత 24 గంటల్లో అతితీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.
ఈ తుఫాన్ కు యాస్ అని పేరు పెట్టింది ఒమాన్. అరబిక్ లో యాస్ అంటే సువాసన వెదజల్లే మొక్క అని అర్థం. ఇంగ్లీష్ లో జాస్మిణ్ అని అర్థం చెప్పుకోవచ్చు. హిందూమహాసముద్రంలో చెలరేగే తుఫాన్ లకు 13 దేశాలుపేర్లు పెడుతూ ఉంటాయి. యాస్ తర్వాత వచ్చే తుఫాన్ కు పాకిస్తాన్ పెడుగుతుంది. వచ్చే తుఫాన్ కి గులాబ్ అనే పేరును పాకిస్తాన్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంతవరకు భారతదేశం గతి, తేజ్, మరసు(తమిళం వాయిద్యం)ఆగ్, ఝార్ (తుఫాన్), గుర్ని(సుడిగుండం),వేగ , నీర్ అనే పేర్లు పెట్టింది.
హిందూమహాసముద్రంలో వచ్చే తుఫాన్ లకు పేర్లు పెట్టే 13 దేశాలు ఇవే: ధాయ్ లాండ్, శ్రీ లంక, పాకిస్తాన్ఒమాన్, మయన్మార్, మాల్దీవులు, బంగ్లాదేశ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యు ఎఇ, యెమెన్,బారత్
ఇది పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు) కు ఉత్తరాన వాయువ్య దిశలో 620 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా) కి 530 కిలోమీటర్లు, బాలసోర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 630 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్) కి ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమయింది.
ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య మే 26 మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది.
“Yass is likely to cross the Odisha-West Bengal coast between Paradip and Sagar Islands noon on my 26 as a very severe cyclonic storm with wind speeds of 155-165 kmph, “అని ఐఎండి వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు , రేపు అక్కడక్కడ ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడే కాకుండా రాయలసీమ తెలంగాణలలో కూాడా గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీచవచ్చు.
♦ Strong surface winds (speed reaching 40-50 kmph) very likely over Coastal Andhra Pradesh & Yanam, Tamil Nadu, Puducherry & Karaikal and Rayalaseema and speed reaching 40-50 kmph over Telangana on 26th May and speed reaching 25-35 kmph likely over Rajasthan, Haryana,Chandigarh
— India Meteorological Department (@Indiametdept) May 24, 2021
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుంది. సముద్రంలో అలలు 2.9 – 4.5 మీటర్ల ఎత్తులో ఎగసి పడతాయి సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రపదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కె కెన్నబాబు విజ్ఞప్తి చేస్తున్నారు.
సైక్లోన్ ప్రభావం వల్ల ఏపీలో ఇవాళ్టి నుంచి 2 రోజులు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
యాస్ తుపాన్ కారణంగా తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.