అమ్మో! వైట్ ఫంగస్ కూడా వచ్చేస్తా ఉంది…

ఇంతవరకు మనం బ్లాక్ పంగస్ గురించి  ఆందోళన చెందాం. అయితే, ఇపుడు వైట్ ఫంగస్ కూడా రోగులమీద దాడి చేస్తున్నది.

బ్లాక్ ఫంగస్ నుంచి రోగులను కాపాడుకునేందుకు ఇంకా ప్రయత్నాలు పూర్తిగా మొదలుకాక ముందే ఇపుడు వైట్ ఫంగస్ తోడవడం ఆందోళన కలిగించే విషయం.

ప్రాణాంతకంగా పరిణమించిన బ్లాక్ ఫంగ స్ ను ఎపిడెమిక్ గా పరిగణించాలని నిన్న కేంద్రం  రాష్ట్రాలను కోరింది.చాలా రాష్ట్రాలు అపుడే బ్లాక్ ఫంగస్ ను ఒక ముప్పుగా ప్రటించాయి.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ విషయం లో ఒకడుగు ముందుకేసి ఈ ముప్పుని ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చింది.  ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స అందించేందుకు వీలుగా బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు చికిత్సకు 17 ఆస్పత్రుల గుర్తించారు. ఆ ఆస్పత్రుల జాబితా ఇదే

  1. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
  2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి
  3. స్విమ్స్‌, తిరుపతి
  4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)
  5. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
  6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప
  7. జీజీహెచ్‌, విజయవాడ
  8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
  9. 9.జీజీహెచ్‌, కర్నూలు,
  10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు
  11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)
  12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల
  13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం
  14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
  15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
  16. కేజీహెచ్‌, విశాఖపట్నం
  17. విమ్స్‌, విశాఖపట్నం.

ఇపుడు వైట్ ఫంగస్ సమస్య తోడవుతూ ఉంది. ఈ వైట్ ఫంగస్ నే స్నో ఫంగస్ కూడా అని కూడా చెబుతారు. బీహార్ లోని పాట్నా ఆసుపత్రిలో నాలుగు వైట్ ఫంగస్ కేసులును గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే మరీ ప్రమాదకరమయిందిగా  చెబుతున్నారు. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులు, గోళ్లు, చర్మం, కపుడు, మూత్రపిండాలు, బ్రెయిన్, జననావయవాలు, నోరు లతో పాటు ఏ అవయవానికైనా సోకే ప్రమాదం ఉంది.

ఇది కోవిడ్ లాగానే ఉపిరితిత్తులను అంటుకుంటున్నది. కొంతమంది రోగుల పరిస్తితిని  హై రెసొల్యూషన్ సిటి (HRCT)తో పరిశీలించినపుడు వైట్ ఫంగస్ విషయం బయటపడింది

వైట్ ఫంగస్ సోకిన వారెవరూ కోవిడ్ పాజిటివ్ కేసులు కాదని, అయితే, వారిల్ కోవిడ్ రోగ లక్షణాలు కనిపించాయని పట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు చెంది చీఫ్ మైక్రోబయాలజిసటు డా  ఎస్ ఎన్ సింగ్ తెలిపారు. వారంతా చికిత్సతో కోలుకున్నారని ఆయన వెల్లడించారని రిపబ్లిక్ టివి రాసింది.

ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్ వల్ల తీవ్రపరిణామాలు ఉంటాయని కూడా డాక్టర్ సింగ్ చెప్పారు. ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న కోవిడ్ పేషంట్లమీద వైట్ ఫంగస్ దాడి చేస్తుండటం కనపించిందని,ఇదిపిల్లలను కూడా సోకుతుందని, ముఖ్యంగా క్యాన్సర్ రోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *