కరోనా రోగులతో కిటకిట లాడుతున్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు సందర్శించారు. అక్కడ చికిత్సపొందుతున్న రోగులను పరామర్శించారు, వైద్యం, వసతుల గురించి వాకబు చేశారు. ఆసుపత్రి పనితీరు గురించి డాక్టర్లతో మాట్లాడారు. కరోనా రిస్క్ లేక్కచేయకుండా పనిచేస్తున్న డాక్టర్లను, నర్సులను అభినందించారు. ఫార్మ్ హౌస్ ఐసోలేషన్, రివ్యూ మీటింగులను వదులకుని ముఖ్యమంత్రి ఇలా ఆసుపత్రి బాట పట్టాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు చెబుతూ వస్తున్నాయి. ఆలస్యంగా నైనా కెసిఆర్ ఆసుపత్రులను సందర్శించాలన్న విషయం గుర్తించారు.