‘మోడీ బ్రాండ్‌’పై క‌రోనా దెబ్బ‌

(అనిర్బ‌న్ బౌమిక్‌, ఆనంద్ మిశ్రా, డెక్క‌న్ హెరాల్డ్ , న్యూఢిల్లీ)

అనువాదం : రాఘ‌వ శ‌ర్మ‌

‘భార‌త దేశానికి కొత్త ముఖం న‌రేంద్ర మోడీ’ అని టైమ్స్ ప‌త్రిక 2014 జూన్ 2వ తేదీ సంచిక‌లో కీర్తించింది.

అదే ఏడాది ఏప్రిల్‌, మే నెల‌ల్లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

‘భారత సంస్క‌ర‌ణ‌ల ర‌థ‌సార‌ధి’ అని మోడీని న్యూయార్క్ నుంచి వ‌చ్చే టైమ్స్‌లో 2015 ఏప్రిల్ 16వ తేదీ సంచిక‌లో మ‌రోసారి కీర్తిం చారు.

ఆ రాసింది ఎవ‌రో కాదు, నాటి అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా.

ఆ మ‌రుస‌టి నెల 7వ తేదీన‌ టైమ్స్ ముఖ‌చిత్రంగా మోడీ ఇంట‌ర్వ్యూ వచ్చింది. ఆ ప‌త్రిక ఆన్‌లైన్ పోల్ సర్వే నిర్వ‌హిస్తే ఆ ఏడాది టైమ్ వ్య‌క్తిగా మోడీ ఎంపిక‌య్యారు.

మోడీ 2019 ఎన్నిక‌ల‌లో బీజేపీ ప్ర‌చార‌ ర‌థ‌సార‌థిగా రెండ‌వ సారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ సంద‌ర్భంగా టైమ్ 2019 మే9వ తేదీ సంచిక‌లో ‘భార‌త విభ‌జ‌న రాజ‌కీయాల నాయ‌కుడు’ అని జ‌ర్న‌లిస్టు, న‌వ‌లా ర‌చ‌యిత అతిష్ త‌సీర్ రాశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి రెండ‌వ ద‌శ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న‌స‌మ‌యంలో న్యూఢిల్లీలోని స్మ‌శానాల‌లో పెద్ద సంఖ్య‌లో శ‌వ‌ద‌హ‌నాలు జ‌రుగుతున్న ఫొటోల‌ను టైమ్ ముఖ చిత్రంగా ప్ర‌చురించింది.

‘భార‌త సంక్షోభం’ అని ముఖ‌చిత్ర క‌థ‌నంతోపాటు, ‘ మోడీ ఎలా విఫ‌ల‌మ‌య్యారు’ అని మ‌రో క‌థ‌నాన్ని కూడా ప్ర‌చురించింది.

దేశంలో లెక్క‌లేనంత మందికి రెండ‌వ విడ‌త విజృంభించిన క‌రోనా వైర‌స్ సోకింది.ఆరోగ్య స‌దుపాయాల కోసం ప్ర‌జ‌లు ప‌రుగులు తీశారు.ఆస్ప‌త్రుల వ‌ద్ద‌, మెడిక‌ల్ షాపుల వ‌ద్ద‌ పెద్ద పెద్ద క్యూలు ఏర్ప‌డ్డాయి. ఆక్సీజ‌న్ దొర‌క‌క చాలా మంది మృత్యువాత ప‌డ్డారు.

చివ‌రికి శ్మ‌శాన వాటిక‌ల్లో శ‌వ‌ద‌హ‌నానికి కూడా క్యూలు ఏర్ప‌డ్డాయి.టీకా కొర‌త‌తో వాక్సిన్ కేంద్రాలు కూడా మూత ప‌డ్డాయి.

ఈ ప‌రిస్థితికి ప్ర‌ధాన మంత్రి, ప్ర‌భుత్వ యంత్రాంగ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని ఒక్క టైమ్ ప‌త్రికేకాదు, అనేక విదేశీ ప్ర‌తిక‌లు కూడా రాశాయి.

ఈ సంక్షోభానికి ప్ర‌ధాని అతి విశ్వాస‌మే కార‌ణ‌మ‌ని లండ‌న్‌ నుంచి వెలువ‌డే ద గార్డియ‌న్ ప‌త్రిక సంపాద‌కీయం రాసింది.క‌రోనా మ‌హ‌మ్మారి రెండ‌వ ద‌శ తీవ్రంగా విజృంభించ‌డంతో మోడీ గిజ‌గిజ‌లాడుతున్నార‌ని లండ‌న్ నుంచి వెలువ‌డే ద టైమ్స్‌ ప‌త్రిక రాసింది.

 

credit: Deccan Herald

 

ఈ మ‌హ‌మ్మారి ప్రాణాల‌ను క‌బ‌ళిస్తున్న‌ప్ప‌టికీ బీజేపీ ప్ర‌భుత్వం ఆత్మ‌సంతృప్తి చెంది, ఈ విమ‌ర్శ‌ను తిర‌స్క‌రించింది.మ‌ళ్ళీ క‌రోనా విజృంభించ‌డం అనివార్య‌మ‌ని, ప్ర‌భుత్వ వైప‌ల్యం చెంద‌లేద‌ని న‌మ్మ‌బ‌లికింది.

‘మోడీ కీర్తికి కళంకం తెచ్చిన క‌రోనా సంక్షోభం’ అన్న ప‌తాక శీర్షిక‌తో న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించింది. ఈ విప‌త్తు స‌మ‌యంలో కుంభ‌మేళాతో పాటు కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్‌, పాండిచ్చేరి, త‌మిళ‌నాడు, అస్సాం రాష్ట్రాల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోడీతోపాటు అమిత్ షా త‌దిత‌ర బీజేపీ నాయ‌కులు, ఇత‌ర పార్టీల నాయ‌కులు ప్ర‌చారాలు నిర్వ‌హించ‌డం కూడా క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణ‌మ‌ని వాషింగ్ట‌న్ పోస్ఠ్ విమ‌ర్శించింది.

వైరస్ నిలువ‌రించ‌లేక‌పోవ‌డం, ముందు చూపులేక‌పోవ‌డం, త‌ల‌బిరుసుత‌నం, స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం వంటి వాటికి ప్ర‌ధాని బాధ్య‌త వ‌హించాలి అని ప్యారిస్ నుంచి వ‌చ్చే లీ మొండి అనే ప‌త్రిక రాసింది.

క‌రోనాను ఎదుర్కోవ‌డంలో మోడీ ప్ర‌భుత్వ వైపల్యాన్ని లాన్‌సెట్ అనే ప్ర‌సిద్ధ‌మైన ప‌త్రిక చీల్చిచెండాడింది.ఇది ప్ర‌ప‌చంలోనే అత్యంత ప‌త్రిష్టాత్మ‌క‌మైన పురాతన ప‌త్రిక‌.

‘ లాక్ డౌన్ లేకుండా, భార‌త దేశాన్ని ఒక అంటు వ్యాధుల ప్ర‌మాదంలోకి న‌డిపిస్తున్న మోడీ’ అని ఆస్ట్రేలియ‌న్ అన్న ప‌త్రిక రాసింది.ఇది నిరా ధార‌, దారుణ‌మైన ఆరోప‌ణ అని, ఈ వ్యాసాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆ ప‌త్రిక ఎడిట‌ర్‌కు లేఖ రాయాల‌ని మోడీ ప్ర‌భుత్వం క్యాంబెర్రాలోని భార‌త హైక‌మిష‌న‌ర్ను కోరింది.

క‌రోనా రెండ‌వ ద‌శ గురించి ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో వ‌చ్చిన కొన్ని పోస్టులు త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌ల్పిస్తున్నాయ‌ని, వాటిని ర‌ద్దు చేయాల‌ని భార‌త‌ ప్ర‌భుత్వం కోరింది.

2014 ఎన్నిక‌ల‌లో కానీ, 2019 ఎన్నిక‌ల్లో కానీ బీజేపీ వ్యూహంలో భాగంగా భార‌త ప‌త్రిక‌లు ప్ర‌భుత్వ వ్య‌తిరేక క‌థ‌నాలు రాయ‌డం వల్ల బీజేపీ అద్భుత‌మైన విజ‌యాల‌ను సాధించింది.

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానం ప‌ట్ల అదే భార‌త ప‌త్రికారంగం, సామాజిక మాధ్య‌మాలు కూడా ఇప్పుడు ఆల‌స్యంగానైనా స్పందిస్తున్నాయి.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న ఈ ప‌రిస్థితుల‌ను ప్ర‌తిప‌క్షాలు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే స్థితిలో లేవు.బీజేపీ కూడా రాజ‌కీయంగా ఎదురు దెబ్బ‌లు తింటోంది.

ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ 213 స్థానాల‌ను సాధించి, బీజేపీని 77 స్థానాల‌కు ప‌రిమితం చేసి దాని జైత్ర‌యాత్ర‌ను అడ్డుకుంది.2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ 128 అసెంబ్లీ స్థానాల‌లో త‌న ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచి, 18 లోక్‌స‌భ స్థానాల‌ను గెలుచుకుంది.

త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది.అస్సాంలో అధికారాన్ని నిల‌బెట్టుకున్న‌ప్ప‌టికీ పాండిచ్చేరిలో స్థానిక‌పార్టీల‌తో పొత్తు పెట్టుకోవడం తో కొంత ఊర‌ట ల‌భించింది.

బెంగాల్ ఎన్నిక‌ల్లో మోడీ అమిత్‌షా చావో రేవో అన్న‌ట్టుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన‌ప్ప‌టికీ ఓట‌మి త‌ప్ప‌లేదు.స్ప‌ష్ట‌మైన మార్పు మాత్రం క‌నిపిస్తోంది.

2014 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌హ‌రాష్ట్ర‌, హ‌ర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల‌లో గెలిచిన్న‌ప్ప‌టికీ, 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మాత్రం, ఆ రాష్ట్రాల‌లో సత్ఫలి తాల‌ను చూపించ‌లేక‌పోయింది.

బీజేపీ 2017 గుజ‌రాత్ ఎన్నిక‌ల‌లో 200 స్థానాల‌కు గాను కేవ‌లం 99 స్థానాల‌లో గెలిచి అతి క‌ష్టంపైన అధికారాన్ని చేప‌ట్టింది.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ర్ రాష్ట్రాల‌కు 2018 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.

సైద్ధాంతిక‌ ప‌క్ష‌వాతం

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించాక మోడీ ప్ర‌భుత్వం సైద్దాంతిక‌ ప‌క్ష‌వాతాన్ని ఎదుర్కొంటోంది. న‌గ‌రాల్లో, ప‌ట్ట‌ణాల్లో, గ్రామాల‌లో ప్ర‌జ‌ల‌ జీవ‌నాన్ని దెబ్బ‌తీస్తో ఈ క‌రోనా వినాశ‌నాన్ని సృష్టిస్తోంది.

కేంద్రంలో ఏడేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల‌లో కూడా అధికారం చేప‌ట్టి ప్ర‌చారం చేసిన రెండింతల అభివృద్ధి, గుజ‌రాత్ త‌ర‌హా అభివృద్ధి ఏమైంద‌న్న ప్ర‌శ్న‌ను ఎదురుర్కొటోంది.

ఏమైన‌ప్ప‌టికీ, బీజేపీ నాయ‌కులు, దాని మ‌ద్ద‌తు దారులు తీర్పు ఇచ్చిన‌నాటి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తున్నారు.

క‌రోనా వంటి మ‌హ‌మ్మారి ఏ వంద సంవ‌త్స‌రాల‌కో ఒక సారి మాన‌వాళిని క‌బ‌ళిస్తుంద‌ని, ద‌శాబ్దాల‌పాటు సాగిన కాంగ్రెస్ పాల‌న‌లో ఆరోగ్య రంగం నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని, ఈ వైప‌ల్యానికి మోడీ ప్ర‌భుత్వాన్ని బాధ్యులను  చేయ‌డం స‌రికాద‌ని వారు కొట్టి పారేస్తున్నారు.

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2016లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు కేవ‌లం మూడు స్థానాల‌ను మాత్ర‌మే గెలుచుకున్న బీజేపీ, మోడీ జ‌నాక‌ర్ష‌ణ వ‌ల్ల‌నే ఇప్పుడు 77 స్థానాల‌నుగెలుచుకుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు.

రాజ‌కీయ పండితులు 2014 ఎన్నిక‌ల‌తో పోల్చుకుని వేసిన‌ అంచ‌నాల‌ను 2019లో బీజేపీ త‌ల‌కిందులు చేసి 300 పైగా సీట్ల‌ను గెలుచుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2017 జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా రాజ‌కీయ పండితుల అంచ‌నాలు విఫ‌ల‌మై బీజేపీ 384 స్థానాల‌కు గాను 312 స్థానాల‌ను గెలుచుకుంది.

ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి పేరు ప్ర‌క‌టించ‌కుండానే మోడీ జ‌నాక‌ర్ష‌ణ‌తో బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వం కానీ, పార్టీ కానీ ఏం చేస్తున్నాయ‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల‌కు చెందిన ఆ పార్టీ నాయ‌కులు కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

ఒక వేళ 2022లో ముంద‌స్తు ఎన్నిక‌లు వచ్చిన‌ట్ట‌యితే 80 లోక్‌స‌భ‌ స్థానాలున్న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మోడీ బ్రాండ్ ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? ఏమేర‌కు ప‌నిచేయ‌దు ? అనేది అంచ‌నా వేయ‌డానికి ఏదైనా కొలబద్ద ఉన్న‌దా!

బీజేపీపై ఉక్కు పిడికిలి బిగించిన మోడీ, అమిత్ షాలోని లోపాల‌ను ఎత్తి చూపించే వారు బీజేపీలో కానీ, ఆర్ ఎస్ ఎస్‌లోకానీ ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు.

మోడీనే త‌మ ఆలోచ‌న‌ల‌కు స‌రైన నాయ‌కుడ‌ని బీజేపీ,ఆర్ ఎస్ ఎస్ శిబిరాలు ఇప్ప‌టికీ భావిస్తున్నాయి. 2019లో లాగా 2024 లో కూడా మోడీ ఎగి సి పడుతున్న నిరసన అల‌ల‌ను ఎదుర్కోగ‌లుగుతారా అన్న‌ది వేచి చూడాలి.

మ‌న్మోహ‌న్ నాయ‌క‌త్వంలో ప‌దేళ్ళు పాలించాక జ‌రిగిన 2014 ఎన్నిక‌లలో యూపీఏ వ్య‌తిరేక‌తే ముఖ్య‌మైంది. మోడీకి 2024 ఎన్నిక‌లు అగ్నిప‌రీక్ష వంటివి.

మ‌న్మోహ‌న్ సింగ్ లాగా ప‌దేళ్ళు పాలించిన త‌రువాత , క‌రోనా మ‌హ‌మ్మారి శాంతించాక కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ధైర్యంగా ఎదుర్కొంటారా? లేదా అన్న ‌ది కాలమే నిర్ణయించాలి.

(దీనికి మూలం Deccan Herald లో వచ్చిన Covid-19 crisis: Jolt for ‘Brand Modi’? )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *