కోవిడ్ భారత్ ధర్డ్ వేవ్ సింగపూర్ నుంచి వస్తున్నదా?

ఇపుడు సింగపూర్ ను పీడిస్తున్న కరోనా వైరస్ చాలా ప్రమాదకరమయిందని, అది ముఖ్యంగా పిల్లలు కోవిడ్ బారిన పడేలా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.  ఈ వైరస్ భారత్ లోకి ప్రవేశించకముందే  సింగపూర్ కు విమాన సర్వీసులు రద్దు చేయాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.. అదే విధంగాపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే భారత్ కోవిడ్ థర్డ్ వేవ్ సింగపూర్ నుంచి వచ్చే ప్రమాదం ఉందని కూఢా కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

 

సింగపూర్ లో కనిపిస్తున్న భారత్ వేరియాంట్ B.1.617 పిల్లల మీద ప్రభావం చూపిస్తుండట పట్ల ఆదేశంలో ఆందోళన మొదలయింది. దీనితో ఇంతవరకు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహిస్తున్నవిద్యాసంస్థలకు శెలవులు ప్రకటించారు. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్టు వచ్చింది. బుధవారం నుంచి ప్రైమరీ, సెకండరీ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలకు ఆన్ క్లాసులు తీసుకోవాలని ఆదేశించారు. సింగపూర్ లో కనిపిస్తున్న కొన్ని రకాల కరోనా వైరస్ చాలా  శక్తి వంతమయినవని ఆదేశ విద్యాశాఖ మంత్రి చెప్పారు.

Some of these (virus) mutations are much more virulent, and they seem to attack the younger children,   విద్యాశాఖ మంత్రి చాన్ చుంగ్ సింగ్ (Chan Chun Sing) తెలిపారు.

చాలా కాలం సింగపూర్ లో నామమాత్రంగానే కోవిడ్ కేసులు కనిపిస్తూ వచ్చాయి. ఇతర ఏసియా ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే సింగపూర్ కేసులు లెక్కలోకి రావు. అయితే, ఈ మధ్య ఇక్కడ కేసులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. దీనితో ఆదివారం నుంచి సింగపూర్ ప్రభుత్వ కరోనా వైరస్ వ్యాప్తలి నివారించేందుకు కఠినంగా ఆంక్షలు అమలుచేస్తూ ఉంది.సింగపూర్ వ్యాక్సిన్ కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు 20 శాతం ప్రజలకు టీకాలు అందాయి.

మే 14 నుంచి సింగ పూర్ లాక్ డౌన్ అంక్షలు మొదలయ్యాయి. ఇవి జూన్ 13 దాకా కొనసాగుతాయి.ఆదివారం నాడు సింగపూర్ లో 38 కొత్త పాజిటివ్ కేసులు కనిపించాయి.ఇందులో 18 రకాలు ఏ క్లస్టర్ తోసంబంధం లేని రకాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *