వైసిపి రెబెల్ ఎపిం రఘురామ కృష్ణ రాజు‘లాకప్ టార్చర్ ’ కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో అనుకోని మలుపుతిరిగింది. ఆయనను ఆంధ్రపోలీసులు దేశద్రోహం (Sedition) కింది అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఎపి సిఐడి కోర్టుకు మరుసటి రోజు తరలించారు. అయితే, తనని పోలీసు బాగా కొట్టారని ఆయనను కోర్టుకు ఫిర్యాదు చేశారు. తనని కస్టడీ లో టార్చర్ చేశారని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని, ఆయనకు ప్రాణ హాని ఉందని ఎంపి తరఫున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయింది. ఇది కొద్ది సేపటికింద జస్టిస్ వినీత్ నారాయణ్, జస్టిస్ బిఆర్ గవాయ్ ల ధర్మాసనం ముందు విచారణ కు వచ్చింది. ఈ కేసులు రఘురామ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలతో సుప్రీం కోర్టు పూర్తిగటా ఏకీభవించింది.
రోహత్గీ వాదనలు విన్నతర్వాత బెంచ్ ఈస్పెషల్ లీవ్ పిటిషన్ మీద అనూహ్యమయిన నిర్ణయం ప్రకటిచింది.
ఆయన బెయిల్ దరఖాస్తును పరిశీలించేందుకు నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ రాజును సికిందరాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది.
ఉత్తర్వులోని ప్రధానాంశాలు
*వైద్య పరీక్షలను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన జ్యుడిషియల్ అధికారి ముందు నిర్వహించాలని కూడా కోర్టు చెప్పింది.
*ఆర్మీ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ముగ్గురుసభ్యుల మెడికల్ బోర్డు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి.
*మెడికల్ ఎగ్జామినేషన్ ను మొత్తం వీడియో గ్రాఫ్ తీయాలి. దానిని సీల్ చేసిన కవర్ లో తెలంగాణ హైకోర్టు కు సమర్పించాలి. తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు పింపించాలి.
*రఘరామను కోర్టు ఉత్తర్వులిచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలి, ఈ ఆసుపత్రి కాలాని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలి. ఆసుప్రతికయ్యే ఖర్చులను మాత్రం రఘురామ భరించాలి.
రఘరామకృష్ణ రాజు తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదించారు. కోర్టు ముందు చాలా ఆసక్తికరమయిన విషయాలుంచారు. అందులో ప్రధానమయింది రఘురామ మీద వైద్య పరీక్షలు జరిపిన మెడికల్ బోర్డు. దీనికి నాయకత్వం వహించింది గైనకాలజీస్తు. ఆమె భర్త రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలాంటి బోర్డుతో పరీక్ష ఏమిటని రోహత్గీ ప్రకటించారు.
వైఎస్ ఆర్ పార్టీని విమర్శిస్తూ వస్తున్నందునే తన క్లయింట్ మీద దాడి జరుగుతూ ఉందని చెబుతూ ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని, తటస్థ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరారు.
తన క్లయింట్ కు ప్రాణ హాని ఉన్నందున Y క్యాటగరి భద్రత కావాలని గత ఏడాదే ఢిలీ హైకోర్టును కోరిన విషయాన్నికూడా కూడా రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రఘురామరాజు చేసిన ప్రసంగాలలో హింసను ప్రేరేపిస్తున్నట్లుగాని, ఎవరినైనా రెచ్చగొడుతున్నట్లు గాని లేదని చెబుతూ IPC సెక్షన్ 124A కింద కేసులు పెట్టాల్సిన పరిస్థితులే లేవని రోహత్గీ వాదించారు.
ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు చాలా మామూలుగా అన్నిటింటిని 124A సెక్షన్ కిందికి తెస్తున్నారు. అపుడు కోర్టు ఇదేదో సీరియస్ వ్యవహారమని భావించి బెయిల్ నిరాకరిస్తాందునే ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి (Today, the government as a matter of course are adding 124A, so that a man does not get bail because courts feel it is a serious matter)అని ఆయన అన్నారు.
మే 14 వ తేదీన, తన క్లయింట్ బర్త్ డే రోజున, ఒక పోలీస్ పార్టీ హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి, 300 కిమీ దూరాన ఉన్న గుంటూరు కు తీసుకవచ్చింది. తర్వాత కస్టడీలో ఆయన బాగా కొట్టారు. ఆయన శరీరం మీద గాయాల గుర్తులున్నాయని మేజిస్ట్రేట్ కూడా రికార్డు చేశారు.ఆయనకు ఇటీవలే బై పాస్ సర్జరీ కూడా అయింది. అదువల్లే మేజిస్ట్రేల్ ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ప్రయివే టు ఆసుప్రతి లో కూడా ఆయన వైద్యపరీక్షలు నిర్వహించాలిన ఆదేశించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఒక మెడికల్ బోర్డు ను ఏర్పాటుచేశారు. దానికి గైనెకాలజిస్టు నేతృత్వం వహించారు. ఆమె భర్త ప్రభుత్వ లీగల్ సెల్ హెడ్ గా పనిచేస్తున్నారు. అందువల్ల సికిందరాబాద్ లేదా గొల్కొండలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించాలని రోహత్గీ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే మాత్రం మంగళగిరిలోని ఆఖిల భారత వైద్యశాస్త్రాల సంస్థలో వైద్యపరీక్ష ,చేయించవచ్చని సూచించారు. ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు కాబట్టి, రోహత్గీ అనుమానాలకు తావుండదని దవే వాదించారు.
అయితే, కోర్టు సికిందరాబాద్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు జరిపించాలని ఆదేశించింది.