రాష్ట్రంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ బెడ్ సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, రాజమండ్రి ఎంపి భరత్ ఆక్సిజన్ బెడ్ సమస్యను తీర్చేందుకు ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. దీనిని ‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’. ఇదొక ఆక్సిజన్ బస్. తక్షణం బెడ్ దొరకనపుడు కోవిడ్ రోగులను ఈ బస్ ఆదుకుంటుంది. తొలివిడత రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’ ప్రారంభమయింది. ఈ పథకాన్ని ఎంపీ మార్గాని భరత్ గురువారం ప్రారంభించారు.
తమిళనాడు చెన్నై నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ అన్ని ప్రాంతాలలో వినూత్నంగా ఆక్సిజన్ పార్లర్లు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాలో సంచార ఆక్సిజన్ ను మొదలయింది.
రాష్ట్రంలో ఇలా ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకురావాలనుకోవడం ఇదే తొలిసారి. తూర్పుగోదావరి జిల్లా లో మొదటిసారిగా రాజమహేంద్రవరంలో కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యమందించే విధానం మొదలైంది.
ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని భరత్ చెప్పారు.
‘36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు. రెండు బస్సులలో మొత్తం 12 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంటాయి. వీటిని మినీ ఐసీయూలా తయారుచేశారు. ఆసుపత్రిలో బెడ్ లేక ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడేవారికి బెడ్ దొరికేవరకు ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్ అందిస్తారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజ్‌లోంచి రెండు వెన్నెల బస్‌లను ఈ సేవలకు వినియోగిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు రూపకల్పన చేశాం,’ ఎంపీ భరత్‌రామ్ తెలిపారు.
.