చెన్నై నగరమంతా ఆక్సిజన్ పార్లర్లు వస్తున్నాయ్

ఆక్సిజన్ అవసరమయ్యే కోవిడ్ రోగుల కోసం చెన్నైనగర కార్పొరేషన్ ఒక వినూత్న పథకం మొదలుపెడుతూ ఉంది.కోవిడ్ సోకిన వాళ్లు ఆక్సిజన్ శాచురేషన్ లెవిల్స్ పడిపోయి,  ఊపిరాడక ఉక్కరిబిక్కిరవుతుంటారు. వాళ్లకు ఏ ఆసుపత్రిలో ఆక్సిజన్ దొరుకుతుందో తెలియదు. ప్రయివేటు ఆసుపత్రులలో భారీగా డబ్బులిచ్చినా ఆక్సిజన్ దొరకని రోజులివి. చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ మీరే తెచ్చుకోవండని రోగులుకు చెబుతున్నారు. ఆక్సిజన్ కోసం అంబులెన్స్లలో తిరిగిచాలా మందిరోగులు ప్రయాణం మధ్యలోనే చనిపోతున్నారు. ఆక్సిజన్ ఆందక ఎదురవుతున్న ఈ హృదయ విదారక పరిస్థితి నుంచి కోవిడ్ రోగులను గట్టెక్కించేందుకు తమిళనాడు ప్రభుత్వం  అందరికిీ ఆక్సిజన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ వినూత్న ప్రయోగం ప్రారంభిస్తున్నది.

తమిళనాడు లో చెన్నై నగరం కోవిడ్ కేంద్రమయింది.  నిన్న ఒక్కరోజు నగరంలో 7వేల కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఆక్సిజన్ అసవరయ్యే కేసులు సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.

చెన్నై మహానగరంలోని  మూడు ప్రాంతాలలో ఆక్సిజన్ పార్లర్లు తెరవాలని  నిర్ణయించింది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ అవసరమయిన కోవిడ్ పేషంట్లు ప్రాణవాయువు కోసం  పరుగులు పెట్టకుండా ఉండేందుకు గ్రేటర్ చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ ఈ పార్లర్లను ఏర్పాటు చేస్తూ ఉంది.

ఇందులో భాగంగా చెన్నైలోని ప్రతి రీజియన్ లో  నూరు పడకల ఆక్సిజన్ అసుపత్రి ఏర్పాటు చేస్తారు. వూపిరిపీల్చుకోవడం కష్టమయిన వాళ్లకు,ఆక్సిజన్ శాచురేషన్  లెవెల్ 90-92 మధ్య ఉండినా ఆక్సిజన్ అవసరమయిన కోవిడ్ రోగుల కోసం వీటిని ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నారు.

చెన్నై కార్పొరేషన్  మొదటి దశలో మూడు పార్లర్లను ప్రారంభిస్తుంది. వీటి కోసం ఇప్పటికే  2700 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్స్ ను సేకరించిందని, ఇవి తొందర్లోనే నగరానికి చేరకుంటాయని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ సింగ్ బేడీ తెలిపారు. నగరంలో అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలకు అనుకూలంగా ఉండేలా అన్ని ప్రాంతాలలో ఈ పార్లర్లను ఏర్పాటు చేస్తారు.

ఇదేవిధంగా ఆర్ టి పిసిఆర్ పరీక్ష లవిషయంలో కూడా కొద్ది మార్పులు చేశామని చెబుతూ, ఇక నుంచి పరీక్ష రిపోర్టును నేరుగా పాజిటివ్  పేషంట్లకు ఇవ్వరాదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *