దాతలారా మా మనవి ఆలకించండి!

(చందమూరి నరసింహారెడ్డి)

గుళ్ళు గోపురాలకు లక్షలు ,కోట్ల రూపాయలు ఇస్తున్న దాతలకు మాదో చిన్న విన్నపం. మీరు చేస్తున్న దానం మహా గోప్పది. అందులో ఏలాంటి సందేహం లేదు. మీ దాతృత్వాన్ని మేము తప్పు పట్టడంలేదు.

నిస్సందేహంగా మీరు త్యాగశీలురే , గొప్పవారే. గతం గతః. ఇప్పటినుంచి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దానం ఇవ్వాలను కొనేవారు , ఆస్తుల లను వీలునామా రాసే వారు ఒక సారి ఆలోచించి మేము సూచిన మార్గం కూడా ఆలోచించమని మనవి.

మానవసేవే మాధవసేవ అని గొప్పవాళ్లు చెబుతారు. మానవునికి సేవ చేస్తే చాలు మీ జన్మ చరితార్థమైనట్లేననంటారు.  కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.తగినన్ని వైద్యశాలలు లేక ,ఆక్సిజన్ బెడ్స్ లేక ,వెంటిలేటర్ బెడ్స్ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. పోరాటం చేసి పోరాడలేక ఓటమి అంగీకరించి మరణిస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు  ఇక్కడ అప్రస్తుతం. దాతలు తమ దానాన్ని వైద్యశాలలు నిర్మించేందుకు వినియోగించండి. వాటిని దేవాలయాలకు అప్పగించండి.

వాటి నిర్వహణకు వీలైతే కొంత మొత్తం కేటాయించండి. దానితో ఆ వైద్యశాల నడపమని కోరుతూ దేవునికి అంకితం చేయండి. దేవాదాయ శాఖ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం నుంచి ఆ వైద్యశాలు నిర్వహించాలని కోరండి. భవిష్యత్తులో ఇంకా ఏలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.

బాధితులు నిత్యం మీ సేవలను తలచుకొంటారు. లక్షలాది మంది ప్రజలు మీ సేవను వాడుకొంటారు. మిమ్ములను దేవుడు లా పూజిస్తారు. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని ప్రార్థిస్తారు. దేవాదాయ శాఖ కూడ ఇలాంటి వైద్యశాలలు ను విజయవంతంగా నిర్వహించాలి. హుండీ ఆదాయం ద్వారా వాటిని నడపండి. ఏ మతస్థులైనా వారి వారి విశ్వాసానికి అనుగుణంగా వారి అభీష్టంమేరకు వీటి నిర్వహణని అప్పజెప్పండని మనవి. చర్చీలకైనా ,మసీదులకైనా పర్వాలేదు.

మాకు కుల,మతాల పట్టింపులేదు. మనమంతా మానవులం. గాలి ,నీరు ,నిప్పు అందరికీ ఒకటే వాటికి లేని కులమతాలు మనకెందుకు. సేవకు కులమతాలతో ముడిపెట్టవద్దనది మా అభిప్రాయం. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవిద్దాం. అనేక పట్టణాల్లో, నగరాల్లో , సమీపంలో దేవాదాయశాఖ, వక్ఫ్,చర్చి స్థలాలు,భూములు ఉన్నాయి. అందులో వైద్యశాలలు నిర్మించడానికి దాతలు ముందుకొచ్చినప్పుడు ఆ స్థలాలను వెంటనే కెటాయించి తగిన గడవులో పూర్తి చేయించి స్వాధీనం చేసుకొని నడపేలా నిబంధనలు సులభతరం చేయాల్సి ఉంది.

తిరుపతి నిమ్స్ ,బర్డ్స్ లాంటి వైద్యశాలలు ఉన్నాయి. అన్ని పెద్ద దేవాలయాల , చర్చీ , మసీదుల ఆద్వర్యంలో మండల , మున్సిపల్,జిల్లా స్థాయిలో ఇలాంటి వైద్యశాలలు రావాలని ఆశిద్దాం. ప్రజల ఆలోచన సరళి లో కూడ చాలా మార్పులు రావాలి. ఏడాది పోడుగునా కొంత కొంత డబ్బు దాచుకొని గుళ్ళు, గోపురాలకు తిరగడం ,విహారయాత్రలకు వెళ్లడం చేస్తున్నారు. రిలాక్సేషన్ మంచిదే.

మీ విశ్వాలను కాదనము తప్పపట్టం. అదేవిధంగా ప్రతి రోజు కొంత మొత్తాన్ని హుండీ లో వేసుకొని ఏడాది తర్వాత దాన్ని ఆరోగ్య భీమా , సాదరభీమా కు ప్రీమియం చెల్లింపు చేసి మీ జీవితాలకు భద్రత పొందండి.

ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఆరోగ్య భీమా ఉంటే మీకు దైర్యం ఉంటుంది. ఆర్థికంగా చితికిపోకుండా ఉంటారు. ఇలా చెబుతున్న నేను ఏ భీమా కంపెనీ ఏజెంట్ కాదు. మీకు నమ్మకం ఉన్న కంపెనీలో భీమా చెసుకొని ధీమా గా ఉండమని చెబుతున్నాం.

చాలా మంది చాలామంది దురలవాట్లకు దుబారా ఖర్చు చేస్తున్నారు వాటిని నియంత్రణ చేసుకొని వీలైనంత ఎక్కువ మొత్తాలకు భీమా చేసుకొండి. భవిష్యత్తులో కరోనా లాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఎదుర్కోవడానికి సంసిద్ధులు కండి. ఇలాంటి విపత్తులు రాకూడదని ఆశిద్దాం.

దయచేసి ఈ సందేశం మీ మిత్రులకు ,మీ గ్రూపుల్లో పోస్ట్ చేయండి. ఏవరో ఒకరు స్పదించవచ్చు.

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, జర్నలిస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *