తెలంగాణలో పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. అదివారంపొద్దున 4,976 కేసులు మాత్రమే కనిపించాయి. ఇలా అయిదువేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు కనిపించడం మార్చి 13 తర్వాత ఇదే . 55 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే, 4,976 పాజిటివ్ కేసలు బయటపడ్డాయి. అయితే,పాజిటివిటీ రేటు ( కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ కేసులు వాట) చాలా ఎక్కువగా 8.99 శాతం ఉంది.దీనికి కారణం, తెలంగాణలో పరీక్షలు చేయడం తగ్గించడమేనని The Hindu రాసింది.
“Although the daily positivity rate is still high in the state at around 8.99 percent-4,976 positives out of 55,358 samples tested on Sunday- the daily positive cases are coming down gradually for the simple reason of low testing.”
హైకోర్టు ఆదేశించడంతో ఒక సి మాత్రం కోవిడ్ పరీక్షలు లక్ష దాటించారు. అది ఏప్రిల్ 8న మొదలయి ఏప్రిల్ 24 దాకా లాగించారు. మళ్లీ ఏప్రిల్ 25 నుంచి రోజు వారి పరీక్షలు తగ్గడం మొదలయింది. ఏప్రిల్ 17న పాజిటివ్ కేసులు 5,000 కనిపించాయి. ఏప్రిల్ 18న తప్ప అప్పటి నుంచి ఇదే నెంబర్ దాటకుండా కోవిడ్ పాజిటివ్ కేసులు ఉండేలా చేయడంలో తెలంగాణ విజయవంతమయింది.
పరీక్షలు ఎంత తగ్గించినా కొన్ని ప్రాంతాలలో కోవిడ్ వ్యాప్తి తగ్గడం లేదు. గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కోవిడ్ అదుపులోకి రాకుండా విజృంభిస్తూ ఉంది. నిన్న ఒక్క జిహెచ్ ఎంసి ఏరియా నుంచే 851 కేసులు వచ్చాయి. ఆతర్వాత రంగారెడ్డి (417 కేసులు), మేడ్చల్-మల్కాజ్ గిరి( 384), సిద్దిపేట (304) జిల్లాలు ఉన్నాయి.
పరీక్షలు ఎంత తగ్గించినా కొన్ని ప్రాంతాలలో కోవిడ్ వ్యాప్తి తగ్గడం లేదు. గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కోవిడ్ అదుపులోకి రాకుండా విజృంభిస్తూ ఉంది. నిన్న ఒక్క జిహెచ్ ఎంసి ఏరియా నుంచే 851 కేసులు వచ్చాయి. ఆతర్వాత రంగారెడ్డి (417 కేసులు), మేడ్చల్-మల్కాజ్ గిరి( 384), సిద్దిపేట (304) జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ మ్యాజిక్ వల్ల నిర్మల్, కుమరం భీమ్-ఆసిఫాబాద్ జిల్లాలలో ఆదివారం నాడు 26 కేసులు మాత్రమే కనిపించాయి. తర్వాత ములురు (29), మెదక్ (33), కామారెడ్డి( 34), జనగామ్ (34), నారాయణ్ పేట (38), జయశంకర్-భూపాల్ పల్లి( 46), ఆదిలాబాద్ (47) జిల్లాలు ఉన్నాయి. మిగతా 20 జిల్లాల్లో అదివారం నాటి కోవిడ్ కేసులు 56 (వరంగల్ రూరల్) నుంచి 271 (కరీంనగర్ ) మధ్య ఉన్నాయి.