కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఎపిలోని ఇతర జిల్లాలకు వెళ్లాలన్న ఇ-పాస్ తప్పని సరి: డిజిపి గౌతం సవాంగ్
ఆంధప్రదేశ్ వారు ఇ-పాస్ ని సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్(@ APPOLICE100), ఫేస్ బుక్(@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చు అని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు మాత్రమే పూర్తి దృవ పత్రలతో ఈ-పాస్ వినియోగించుకోవాలి.ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం మీ రక్షణ కోసం మీ వెంటే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
డిజిపి చేసిన మరిన్ని సూచనలు
శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణం మేరకు సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రలతో అనుమతి పొందాలి.
ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలి.
కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి
అంతరాష్ట్ర రాక పోకలపై నిబంధనలు కొనసాగుతాయిజ
అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయి.