దేశంలోని మొత్తం కరోనా కేసులలో పది రాష్ట్రాల వాటా71.75 శాతం. నిన్న మొత్తంగా 4,03,738 కేసులు నమోదయితే, 72 శాతం కేసులు పది రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఈ విషయాన్ని ఈ రోజు కేంద్రం వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, కర్నాటకలు నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రాలు.
ఇతర ఎనిమిది రాష్ట్రాలు: కేరళ,తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, హర్యానా. ఒక్క మహారాష్ట్ర నుంచి నిన్న56,578 కేసులు నమోదయితే, 47,563 కేసులు కర్నాటక నుంచి, 41,971 కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. ఈ రోజు ఆంధ్ర నుంచి 22,164 కేసులు నమోదయ్యాయి.
ఇంతవరకుదేశంలో 30.22 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇపుడు ఇండియా కోవిడ్ పాజిటివిటి రేటు 21.64 శాతం.