కర్నాటకలో కరోనా తాండవిస్తూ ఉంది. రోజూ వారి కేసులు..నిన్ననే ముఖ్యమంత్రి బిఎస్ యదియూరప్ప సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. మొదటి ఈ నెల 12 దాకే లాడ్ డౌన్ విధించినా, అది పెద్దగా ఫలితాలివ్వకపోవడం కరోనా వ్యాప్తి నివారణకు సంపూర్ణ లాక్ డౌన్ యే మార్గమని ప్రటిస్తూ ఆయన లాక్ డౌన్ విధించారు.
అయితే, యదియూరప్ప పదవికి ముప్పు ఏర్పడింది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఢిల్లీలో ఉన్నతసాయితో పార్టీ నాయకత్వం కర్నాటక నాయకులతో చర్చలు మొదలుపెటిందని వార్తలొస్తున్నాయి.
కరోనా కాలంలో నాయకత్వాన్ని మార్చాలనుకోవడం విశేషం. యదియూరప్పకు బాగా వయసు పైబడిందని, ఆయన పాలన మీద దృష్టిపెట్టలేకపోతున్నారని, పార్టీ అధిష్టానం వారుసుని అన్వేషించడం మొదలుపెట్టింది.
నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకునేందుకు కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ ఉపాధ్యక్షుడు బివై విజయేంద్ర (యడ్యూరప్ప కుమారుడు) ప్రత్యేక విమానాంలో ఢిల్లీ వచ్చారు. ఈ సమా
వేశంలో తర్వాత వారు పార్టీ కర్నాటక ఇన్ చార్జ్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ ను కూడా కలుసుకున్నారు. వీళ్లతో పాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నవదాడి కూడా ఢిల్లీ వచ్చారు. అంతకు గురువారం నాడు టూరిజం మంత్రి సిపి యోగేశ్వర్ కూడా అమిత్ షాతో సమావేశమయ్యారు.
కర్నాకట బృందం ఢిల్లీ లోని కర్నాటక భవన్ లో కాకుండా హోటల్లో బస చేయడం, ప్రయివేటు కార్లలో తిరగడంతో వారి పర్యటన మీద, సమావేశాల మీద అనుమానాలెక్కువయ్యాయి.
యదియూరప్ప లింగాయత్ కులనాయకుడు. ఆయన వయసుల 78 దాటడంతో, పార్టీ ఈ మధ్య భావించినట్లు 75 పైబడిన వారందరిని రాజ్యాంగ పదవులనుంచి తప్పించాలనే నిర్ణయం ప్రకారం ఆయన్ను తప్పిస్తున్నారని బెంగళూరు రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది.
పార్టీలో ఎప్పటినుంచో ఆయన అసంతృప్తి రగులుతూ ఉంది. అయితే, ఆయన చాకచక్యంగా అది తమ మెడకు చుట్టుకోకుండా తప్పించుకుంటూ వచ్చారు. అయితే, ఈ మధ్య కరోనా ఉధృతం కావడం, పార్టీ అసమ్మతి శ్రుతి పెంచడంతో ఇక లాభం లేదని ఢిల్లీ నాయకత్వం భావిస్తూ ఉందని తెలిసింది. మార్పు గురించి యదియూరప్ప ఒక షరతు పెగ్టినట్లు తెలిసింది. ఇపుడు ఉప ముఖ్యమంత్రి అశ్వర్థ నారాయణ్, హో మంత్రి బొమ్మయ్ పేర్లు వినబడుతూ ఉన్నాయి. వీళ్లిద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రి ని చేసిన తన కుమారుడు విజయేంద్రను ఉప ముఖ్యమంత్రిని చేస్తే తాను దిగిపోతానని ఆయన షరతు పెట్టినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.
అయితే, నాయకత్వ మార్పు వార్తలు తప్పు అని , ఢిల్లీ నాయకత్వం కర్నాటక రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును చర్చిచేందుకు మంత్రులను దేశరాజధానిని కి రప్పించారని మంత్రి బొమ్మయ్ తెలిపారు.