వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోలు సెంటర్ ఏర్పాటు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కోవిడ్ బారిన పడిన రోగులకు, ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అండగా నిలుస్తూ క్రియాశీలకంగా పని చేస్తున్నారు, ఈ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ఈమేరకు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ, ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలంతా పాటించేలా వారిని చైతన్యవంతం చేసేందుకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణారెడి ప్రకటించారు.
ఈ సెంటర్ ద్వారా సేవలకు, 9143 54 1234; 9143 64 1234 వాట్సాప్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి.
కోవిడ్ గురించి రోగులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ కోవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు వారికి ఉచితంగా అందేలా కృషి చేస్తాయి.. ఒకవేళ స్థానికంగా కోవిడ్ సెంటర్లు లేని పక్షంలో అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని ఏర్పాటు చేయించేందుకు ఈ సెంటర్ సహకరిస్తుందని ఆయన చెప్పారు.
అలానే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమతమ నియోజకవర్గాల్లో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, అందులో రెండు ఫోన్ నెంబర్లు కేటాయించి, ప్రజలు, ముఖ్యంగా కరోనా రోగులకు సహాయపడుతూ మీరు చేస్తున్న కార్యక్రమాలతో పాటు మీ సలహాలు సూచనలను పార్టీ స్టేట్ కంట్రోల్ సెంటర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన కోరారు.